/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T143356.056-jpg.webp)
Oscar: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా మరోసారి ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ లో మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఓటింగ్ వ్యవధిని పొడిగించాలని అనుకుంటున్నాం.
Also Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
నామినేషన్లు ప్రకటించడానికి తేదీని మార్చాలని , సభ్యులకు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ తెలిపారు. లాస్ ఏంజెలెస్ లో తీవ్రమైన కార్చిచ్చు చెలరేగడంతో మంటలు హాలీవుడ్ ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
Also Read: Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!
చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు కొనసాగుతుంది. కార్చిచ్చు నేపథ్యంలో దీని ఓటింగ్ ఆలస్యమైంది.దీంతో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19 కు వాయిదా వేశారు. అయితే మంటల వ్యాప్తి ఇంకా కొనసాగుతుండడంతో జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ పేర్కొంది.
భారత్ నుంచి ఆరు చిత్రాలు...
ఇక భారత్ నుంచి ఆరు చిత్రాలు నామినేషన్ల బరిలో నిలిచాయి. కంగువ (తమిళం), ది గోట్ లైఫ్(హిందీ), స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), సంతోష్ (హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ, ఇంగ్లీష్ ) చిత్రాలు పోటీ పడుతున్నాయి.