Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

మరికొన్ని గంటల్లోనే శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేయనుంది.మకరజ్యోతిని నేరుగా దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు.జ్యోతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులుఅన్ని ఏర్పాట్లు చేసింది.

New Update
Sabarimala86

Sabarimala: శబరిమల కొండల్లో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం వచ్చేసింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే నేడు శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Also Read: South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్‌!

టీవీలు, సోషల్ మీడియాల్లో ఈ మకరజ్యోతికి సంబంధించిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో శబరిమల ఆలయానికి ఎదురుగా ఉండే కందమల శిఖరంపై మకరజ్యోతి కనపడుతుంది. ఈ అద్భుత మకరజ్యోతిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకుంటుంటారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు.. దీక్షను తీస్తారు. భక్తులను ఆశీర్వదించేందుకు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల నమ్ముతారు.

Also Read: Ashwini Vaishnaw: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

మకరజ్యోతి నిజమైందేనా...

2011లో మకరజ్యోతి సందర్భంగా శబరిమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించారు. ఆ సందర్భంగా అప్పటివరకు ఎన్నడూ లేని విధంగా మకరజ్యోతి విశ్వసనీయతపై అనేక సందేహాలు మొదలైయ్యాయి. అసలు ఆ మకరజ్యోతి నిజమైందేనా.. ఎవరైనా వెలిగిస్తారా అనే అనుమానాలు రేగాయి. అయితే శబరిమల ఆలయ ప్రధానార్చకుడు చెప్పిన ప్రకారం మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదని.. అదొక దివ్య నక్షత్రం అని.. మకర విళక్కు అంటే కొండపై నుంచి 3 సార్లు కనిపించే దీపమని వివరించారు.

పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధన అని తేలింది. అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా మకరజ్యోతి అనేది నిజం కాదని.. ఆ మకరజ్యోతిని మానవులే వెలిగిస్తున్నారని అంటున్నారు.
 
మకర సంక్రాంతి రోజున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణులలో ఈ మకరజ్యోతి కనపడుతుంది. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంటే మరుజన్మ లేకుండా భగవంతుడిని చేరుకుంటారని అర్థం. 

ఇక శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు అయ్యప్పస్వామికి అలంకరణ చేస్తారు. అనంతరం మూలమూర్తికి హారతులు ఇస్తారు. పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి కనపడుతుంది. ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఆ సమయంలో శబరిగిరులు మొత్తం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో హోరెత్తుతాయి.

Also Read: Madhya Pradesh: ఇక నుంచి రాష్ట్రంలో ఆ పట్టణాల్లో మద్యం బంద్‌!

Also Read: బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు