Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు.

New Update
BEST 108 MP CAMERA 5G SMARTPHONES UNDER RS 15K

BEST 108 MP CAMERA 5G SMARTPHONES UNDER RS 15K

Best Camera Mobiles: తక్కువ ధరలో అదిరిపోయే కెమెరా ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా?.. అలాంటి ఫోన్ కోసం తెగ సెర్చ్ చేసేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కేవలం రూ.15 వేలలోపే ది బెస్ట్ కెమెరా 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 50 కాదు 60 కాదు ఏకంగా 108 ఎంపీ కెమెరా గల ఫోన్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ఫ్లిప్‌‌కార్ట్‌లో POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను కొనుక్కోవచ్చు.  

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

OnePlus Nord CE 3 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరతో భారీ కెమెరాను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.19,999 కాగా ఇప్పుడు రూ.14,840గా లిస్ట్ అయింది. దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ధర 8/128 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఈ ఫోన్ 6.72 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 108ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కలర్ వేరియంట్ బట్టి ధర మరింత తగ్గుతుంది.   

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

Infinix Note 40X 5G

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా తక్కువ ధరలో అతి పెద్ద కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.21,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.13,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ తగ్గింపు ఉంది. ఇంకా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ సైతం లభిస్తుంది. ఈ ధర 12/256 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇది 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 108 ఎంపీ + 2ఎంపీ + ఏఐ లెన్సెలతో వస్తుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

REDMI 13 5G

రెడ్ మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా 108 ఎంపీ కెమెరాను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.17,999 కాగా ఇప్పుడు కేవలం రూ.12,335కే కొనుక్కోవచ్చు. దీనిపై కూడా రూ.1000 తగ్గింపు ఉంది. ఈ ధర 6/128 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇది 108 రియర్ కెమెరాను కలిగి ఉంది. 5030 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 

POCO M6 Plus 5G

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్‌ మరింత తక్కువకు లభిస్తుంది. దీని 6/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 ఉండగా.. ఇప్పుడు రూ.11,499లకే లభిస్తుంది. దీనిపై రూ.1000 డిస్కౌంట్ ఉంది. అలాగే రూ.8,900 ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్ 108 ఎంపీ+2ఎంపీ బ్యాక్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5030 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో ఫోన్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు