దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్‌..

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్‌ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CHat gpt

ప్రస్తుతం చాట్‌జీపీటీ వాడేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. చాలామంది నెటిజన్లు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా ఏఐ చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. అయితే దీని మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు వినియోగదారులు అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇస్తున్న చాట్‌జీపీటీలో సెర్జ్‌ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఇంతకుముందులా సెర్చ్‌ ఇంజిన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పింది.   

Also Read: షేక్ హసీనాకి భారీ షాక్.. పార్టీ కార్యాలయంపై దాడి

మొబైల్‌ యాప్‌లో కూడా

ఇకనుంచి చాట్‌జీపీటీ హోమ్‌పేజీలో కొత్తగా సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ కనిపించనుంది. అక్కడినుంచి వార్తలు, క్రికెట్ స్కోరు, స్టాక్స్‌ వంటి సమాచారాన్ని పొందవచ్చన కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‌.. చాట్‌జీపీటీ.కామ్ వెబ్‌సైట్‌తో సహా మొబైల్‌ యాప్‌లో కూడా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్లస్, టీమ్ యూజర్లు, సెర్చ్‌జీపీటీ వెయిట్ లిస్ట్‌ యూజర్లకు ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఎంటర్‌ప్రైజెస్, ఎడ్యుకేషనల్ యూజర్లు కొన్ని వారాల్లో ఈ సదుపాయాన్ని అందుకోబోతున్నారు. చాట్‌జీపీటీని ఫ్రీగా వినియోగించే వారికి కూడా మరికొన్ని నెలల్లో ఈ ఫీచర్‌ తీసుకురానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 

Also Read: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే!

ఇప్పటివరకు చాట్‌జీపీటీలో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు డేటాబేస్ ఆధారంగా ఉన్న సమాచారం మాత్రమే వచ్చేది. ఇకనుంచి ఏమైన ప్రశ్నలు అడిగితే వెబ్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించనుంది. ఫాలో-అప్‌ ప్రశ్నలకు సైతం సమాధానం ఇస్తుంది. వాతావరణం, న్యూస్, స్పోర్ట్స్, స్టాక్స్, మ్యాప్స్ కోసం ఓపెన్‌ఏఐ సంస్థ.. ఫైనాన్షియల్ టైమ్స్, బిజినెస్ ఇన్‌సైడర్, టైమ్‌ మ్యాగజైన్ లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

 

Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు