దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే! అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాక్‌లోని మిలిటెంట్ల ద్వారా ఇరాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల మళ్లీ ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉండదని ఇరాన్ అభిప్రాయ పడుతోంది. By Kusuma 01 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు వినియోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5వ తేదీన ఉన్నాయి. దీనికంటే ముందుగానే ఈ దాడులు చేసే అవకాశం ఉంది. అయితే ఇరాన్.. ఇరాక్‌లోని మిలిటెంట్ల ద్వారా దాడిని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల మళ్లీ ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉండదని ఇరాన్ అభిప్రాయం. ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాడులకు ప్రతీకారంగా.. హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన నిల్పోరూషన్ మరణంపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. మరోసారి దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి యుద్ధం దాడులు జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే అని భావిస్తున్నారు. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్‌పై దాదాపు 200 యుద్ధవిమానాలతో దాడికి దిగింది. డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై దాడి చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! ఇదిలా ఉండగా.. కొత్త స్కెచ్‌తో ఇజ్రాయెల్ కూడా మళ్లీ ఇరాన్‌పై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌పై దాడులు చేసి ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ జరిగిన కేబినెట్‌లో ఈ కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైన రెండు వారాల కిందట అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్ ఈ దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేరు. కానీ ఇళ్లు మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే ఈ దాడి వెనుక ఇరాన్ స్కెచ్ ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ కారణంగా మరోసారి ఇరాన్‌పై భీకర దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. మళ్లీ ఇజ్రాయెల్ దాడులు మొదలు పెడితే ఈ సారి యుద్ధం తప్పదని ఇరాన్ భావిస్తోంది. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్! #iran-israel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి