షేక్ హసీనాకి భారీ షాక్.. పార్టీ కార్యాలయంపై దాడి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు అంటించారు. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన అల్లర్లు కారణంగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయి ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. By Kusuma 01 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి భారీ షాక్ తగిలింది. ఢాకాలోని అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపైన దుండుగులు దాడి చేశారు. ఆమె ఆఫీస్‌ను పూర్తిగా ధ్వంసం చేసి పార్టీ కార్యాలయానికి నిప్పు అంటించారు. రిజర్వేషన్ల విషయంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో షేక్ హసీగా గతేడాది బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చూడండి: Health Tips: పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! నిరసనలు తీవ్రం కావడంతో.. బంగ్లాదేశ్‌కు స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి అక్కడ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. స్వాత్రంత్య ఉద్యమంలో పోరాడిన పిల్లలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టగా.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు హసీనా ప్రభుత్వం తెలిపింది. కానీ గతేడాది మళ్లీ పాత రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో విద్యార్థులు ఆగ్రహించి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్ వచ్చేసింది. ప్రస్తుతం ఈమె భారత్‌లోనే ఉంటున్నారు. ఇది కూడా చూడండి: Karnataka: షాకింగ్ న్యూస్.. ఆలయంలో భారీ తొక్కిసలాట.. వేల సంఖ్యలో...! ఇదిలా ఉండగా.. షేక్ హాసీనా దేశం విడిచి పారిపోవడంతో ఆమెపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: WhatsApp Chat Feature: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్! భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న హసీనాపై జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలతో ఆమెకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై ట్రైబ్యునల్ కూడా ఇటీవలే దర్యాప్తు చేసింది. ఆమెను ఎలాగైనా బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఐసీటీ ప్రాసిక్యూటర్ తెలిపారు. అయితే హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయిపోయింది. ఇది కూడా చూడండి: Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు #sheik-hasina మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి