BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

దీపావళి తర్వాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి.

New Update
cylender

Big Breaking: దీపావళి తరువాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రజలకు పెద్ద షాకే ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలుఓ ప్రకటనలో తెలిపాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ.62 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్‌ ఎల్పీజీ ధర రూ.2,028కి చేరుకుంది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. 

Also Read: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌...

మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్‌ ధరల్లో ఆయిల్‌ కంపెనీలు మార్పులు చేస్తుంటాయి.  పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. నవంబర్ 1, 2024 నుండి, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ.1740గా ఉన్న సిలిండర్ ధర రూ.62 పెరిగి రూ.1802కి చేరుకుంది.

Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!

నెల ప్రారంభంలో ధరల ఈ సమీక్ష రెస్టారెంట్లు, హోటళ్లు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అవసరమయ్యే అనేక చిన్న వ్యాపారాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది. దీపావళి తర్వాత, దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో కూడా పెరిగాయి.

Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

 ఈసారి ధరలను రూ.62 పెంచారు. గత నాలుగు నెలల్లో సిలిండర్‌పై సగటున రూ. 156 పెరిగింది, హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న వ్యాపారాలపై అదనపు భారాన్ని మోపింది. పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో నాలుగు మహానగరాల్లో ధరలు పెరగడం వ్యాపారులకు ఆందోళన కలిగిస్తుంది.

Also Read: సినిమాల లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రధాన నగరాల్లో 19 కేజీల LPG గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ: రూ.1740 నుంచి రూ.1802కి పెరిగింది కోల్‌కతా: రూ.1850 నుంచి రూ.1911.50కి పెరిగింది హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 2028కి చేరింది. విజయవాడలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1962కి చేరింది.ముంబై: రూ.1692.50 నుంచి రూ.1754.50కి పెరిగింది. చెన్నై: రూ.1903 నుంచి రూ.1964.50కి పెరిగింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు