USA: భారతీయులను బహిష్కరించాలి.. అమెరికా నేత సంచలన వ్యాఖ్యలు

భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్‌ నేత చాండ్లర్‌ లాంగేవిన్‌.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు.

New Update
'Not a single Indian cares, US politician gets censured for mass deportation call | What did he say

'Not a single Indian cares, US politician gets censured for mass deportation call | What did he say

భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్‌ నేత చాండ్లర్‌ లాంగేవిన్‌.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు. ఆయనపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో పామ్‌ బే నగర కౌన్సిల్‌ ఆయనపై చర్యలు తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత నెల నుంచి లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 

Also Read: ఇస్రోకు చంద్రయాన్‌-2 నుంచి కీలక సమాచారం.. చంద్రుడిపై సూర్యుడి ప్రభావం..!

ఓ భారతీయ ట్రక్‌ డ్రైవర్‌ వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో పోస్టులో  అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా రాలేదన్నారు. ఆర్థికంగా వాళ్లు మనల్ని దోపిడి చేస్తున్నారని.. ఈ దేశం అమెరికన్ల కోసం మాత్రమేనని రాసుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలను పామ్‌ బే మేయర్ తప్పుబట్టారు. ఇతరులను కించపభారతీయులను బహిష్కరించాలి: అమెరికా నేత సంచలన వ్యాఖ్యలురిచేలా, విలువలను త్గగించేలా మాట్లాడకూడదని.. అలాంటి వాళ్లకి ఇక్కడ చోటు లేదంటూ ఘాటుగా స్పందించారు.  అయినా కూడా లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు చేయడం ఆపలేదు. 

Also Read: మల్లోజుల, ఆశన్నలు విప్లవద్రోహులు..మావోయిస్టు పార్టీ సీరియస్‌ వార్నింగ్‌

'' ఈరోజు నా బర్త్‌ డే. ప్రతి భారతీయుడి వీసాను రద్దు చేసి వెంటనే ఇక్కడి నుంచి బహిష్కరించాలని. ఇదే నా కోరిక'' అని రాసుకొచ్చారు. ఈ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా ట్యాగ్ చేశారు.  లాంగేవిన్ చేసిన వ్యాఖ్యలపై నగర కౌన్సిల్ చర్యలు తీసుకుంది. ఆయన కమిటీ నుంచి తొలగించింది. అలాగే ఆయన మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సూచనలు చేసింది. ఈ చర్యలను లాంగేవిన్ ఖండించారు. 

Also Read: బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా జేఎంఎం? ఆరుస్థానాల్లో అభ్యర్థులు

Advertisment
తాజా కథనాలు