/rtv/media/media_files/2025/10/06/optional-practical-training-program-2025-10-06-13-57-14.jpg)
అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా విదేశీ విద్యార్థులపై(Foreign Students in US) ఇదే తరహాలో నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ పొందే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లు ప్రతిపాదించింది. వేలాది మంది భారతీయ విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, భారతీయ విద్యార్థుల ఉద్యోగ, ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ ప్రతిపాదన కేవలం విద్యార్థులకే కాక, అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. విదేశీ విద్యార్థుల ఫీజులపై ఆధారపడిన యూఎస్ విశ్వవిద్యాలయాలకు కోట్లాది డాలర్ల ఆదాయం తగ్గుతుంది. ఈ నిర్ణయం అమెరికా సొంత కంట్లో పొడుటుకున్నట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పని చేయడానికి వ్యక్తులు లేక అమెరికా ఇతర దేశాల నుంచి ఆహ్వానించింది. ఇప్పుడు ఈ ఓటీపీ రద్దు చేస్తే మళ్లీ మా దేశానికి రండీ అని అడుక్కోవడం ఖాయమంటున్నారు ఉపాధి రంగంలో నిపుణులు.
అలాగే స్టెమ్ రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులను కోల్పోవడంతో అమెరికన్ టెక్ పరిశ్రమలో వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న వీసా నిబంధనల కారణంగా, చాలా మంది భారతీయ విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నిర్ణయం అమలైతే, భారతీయ విద్యార్థులు అమెరికాను విదేశీ విద్యకు ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకోవడం తగ్గిపోయే అవకాశం ఉంది.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.
The OPT program actively stifles American graduates by providing a tax incentive to hire foreign graduates instead.
— Young Republicans of Texas (@YRsOfTexas) September 26, 2025
There's no cap on OPT authorization or the student visas that lead to it -- a radically anti-American policy for entry level jobs.pic.twitter.com/AmunMd7ZmM
OPT రద్దుతో సమస్యలు:
1. ఉద్యోగావకాశాలు గల్లంతు:
ప్రస్తుతం, ఎఫ్-1 వీసాపై ఉన్న విద్యార్థులు(indian student visa news) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 12 నెలల పాటు ఓపీటీ ద్వారా అమెరికన్ కంపెనీలలో పనిచేసే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చదివిన వారికి అదనంగా 24 నెలల ఎక్స్‌టెన్షన్ (మొత్తం మూడేళ్లు) లభిస్తోంది. ఓపీటీ రద్దయితే, డిగ్రీ పూర్తయిన వెంటనే విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది, దీంతో వారి ఉద్యోగ అనుభవం పొందే అవకాశం పూర్తిగా కోల్పోతారు.
2. భారీ రుణ భారం:
అమెరికాలో చదువుకునేందుకు చాలా మంది భారతీయ విద్యార్థులు రూ. 20 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు విద్యారుణాలు తీసుకుంటున్నారు. ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదించి, రుణాలు తీర్చుకోవడమే వారి ముఖ్య లక్ష్యం. ఓపీటీ లేకపోతే, రుణాలు చెల్లించడంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
3. హెచ్-1బీ వీసాకు అడ్డంకి:
ఓపీటీ అనేది హెచ్-1బీ (H-1B) వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక ముఖ్యమైన వారధి లాంటిది. ఈ సమయంలో పొందిన పని అనుభవం, వీసా లాటరీలో ఎంపికయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఓపీటీ రద్దయితే, హెచ్-1బీ వీసా పొందే మార్గాలు దాదాపు మూసుకుపోయి, శాశ్వతంగా అమెరికాలో స్థిరపడాలనే 'డాలర్ కల' కల్లగానే మిగిలిపోతుంది.