RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో ఇచ్చిన 227 టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. 

New Update
ipl

RCB VS LSG

ఆర్సీబీ చితక్కొట్టేస్తోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ దూసుకుపోతోంది. నిన్న జరిగిన లక్నో మ్యాచ్ లో బౌలర్లు, బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 228 పరుగులు చేసింది. కెప్టెన్‌ జితేశ్‌ శర్మ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 పరుగులు, విరాట్‌ కోహ్లీ  30 బంతుల్లో 10 ఫోర్లులతో 54 పరుగులు, మయాంక్‌ అగర్వాల్‌  23 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులతో ఆకశమే హద్దుగా చెలరేగిపోయారు. లఖ్‌నవూ బౌలర్లలో విలియమ్‌ ఓ రూర్క్ 2, అవేశ్‌ ఖాన్‌, ఆకాశ్‌ మహరాజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మొత్తానికి ఈ మ్యాచ్ తో లీగ్ దశ పూర్తయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు సెలెక్ట్ అయింది. ఈ నెల 29న క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌తో బెంగళూరు ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. 

రసవత్తరమైన మ్యాచ్..

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 61 బంతుల్లో 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 12 బంతుల్లో 14 పరుగులు, నికోలస్ పూరన్ 10 బంతుల్లో 13 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా 1 వికెట్, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, షెపర్డ్ 1 వికెట్ తీశారు. 

today-latest-news-in-telugu | IPL 2025 | LSG Vs RCB | match

Advertisment
Advertisment
తాజా కథనాలు