TIkToK: టిక్‌ టాక్ ను సొంతం చేసుకున్న ఆ అమెరికా సంస్థ!

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ ను కొనుగోలు చేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి.తాజాగా ట్రంప్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ,వాణిజ్య విభాగాలను ట్రంప్‌ ఆదేశించారు.

New Update
TikTok: అమెరికా నిషేధించినా.. నెం.1 గా టిక్ టాక్!

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ ను కొనుగోలు చేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయం పై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రకటన చేశారు. సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ,వాణిజ్య విభాగాలను ట్రంప్‌ ఆదేశించారు. ఈ మేరకు కార్యనిర్వహక ఉత్తర్వుల పై సంతకం చేశారు.

Also Read: Musk-Aakash: మస్క్‌ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్‌ బొబ్బ..ఎవరో తెలుసా!

కొత్తగా సృష్టించిన సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ టిక్‌టాక్‌ ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అధ్క్ష్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ,ట్రంప్‌ యూఎస్‌ సావరిన్ వెల్త్‌ ఫండ్‌ ను రూపొందిస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా టారిఫ్‌ లు, ఇతర విధానాల ద్వారా హైవేలు, విమానాశ్రయాలు, తయారీ, వైద్య పరిశోధన వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామన్నారు.

Also Read: MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్‌ రైలు!

కాగా ఇటువంటి నిధుల కోసం దేశ బడ్జెట్‌ లోని మిగులు పై ఆధారపడాల్సి వస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2017లో ప్రారంభమైన టిక్‌ టాక్‌ ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి.అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీని వినియోగం పై ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

చైనా యాజమాన్యాన్ని వదలుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందే అనేది బిల్లులోని అసలు విషయం. అనంతరం అమెరికా సుప్రీం కోర్టు కూడా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ కు డెడ్‌ లైన్‌ ఇచ్చింది.ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం 75 రోజుల్లోగా టిక్‌ టాక్‌ ను అమ్మేయాలంటూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పైన సంతకం చేసిన విషయం తెలిసిందే. 

అనంతరం సంస్థ జాయింట్‌ వెంచర్‌ లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే దానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటానని ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Also Read: Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!

Also Read: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు