Trump: వైట్‌ హౌస్‌ లోకి న్యూ మీడియా

ట్రంప్‌ అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు.అందులో భాగంగా వైట్‌ హౌస్‌ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్‌ ఫ్లూయెన్సర్లకు ,పాడ్‌ కాస్టర్లకు ,కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు.

New Update
Donald Trump

Donald Trump

రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్‌ తన పాలనలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఆయన సందేశాలు అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు.అందులో భాగంగా వైట్‌ హౌస్‌ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్‌ ఫ్లూయెన్సర్లకు ,పాడ్‌ కాస్టర్లకు ,కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు.

Also Read: Mahakumbh Mela Stampede: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

వైట్‌ హౌస్‌లో అవకాశం..

మీడియా కార్యదర్శి కరోలీన్‌ లీవిట్‌ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. లక్షల మంది అమెరికన్లు ముఖ్యంగా యువత సంప్రదాయేతర మీడియా పై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే ..స్వతంత్ర పాత్రికేయులు, పాడ్ కాస్టర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్ లు ,కంటెంట్‌ క్రియేటర్లకు వైట్‌ హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నాం. ఇది అధ్యక్షుడు ట్రంప్‌ సందేశాలు వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. అది మా బృంద కర్తవ్యం కూడా అని లీవిట్‌ వివరించారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు.. ఎంతమంది చిక్కుకుపోయారంటే?

ఈ సందర్భంగా..సంప్రదాయంగా బ్రీఫింగ్‌ రూమ్‌ లో ప్రెస్‌ సెక్రటరీ సిబ్బందికి రిజర్వ్‌ చేసిన మొదటి ముందు వరుస సీటును న్యూ మీడియా సీటుగా మారుస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాక..యాక్సియోస్‌,బ్రెయిట్‌బార్ట్‌ వంటి అవుట్‌ లెట్‌ లకు రోజూ శాశ్వత సీటు ఇవ్వనున్నట్లు వివరించారు.

మునపటి పరిపాలనలో రద్దైన 400 మంది జర్నలిస్టుల ప్రెస్‌ పాస్‌ లను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు.

Also Read: ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ ప్రయోగం

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

#telugu-news #Latest News #trump #white-house #latest-telugu-news #latest telugu news updates
Advertisment
Advertisment
తాజా కథనాలు