Indian Stock Market: నువ్వు మమ్మల్నేం చేయలేవురా..ట్రంప్ టారిఫ్ లకు చెక్ పెడుతున్న భారత పెట్టుబడిదారులు

భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్ లో బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం భారత పెట్టుబడిదారులే అని చెబుతున్నారు.

New Update
usa

Trump, US Stock Markets

ట్రంప్ సుంకాలకు భారత్ కుదేలయిపోతుందని అందరూ భావించారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది...ఎప్పటికీ కోలుకోలేదు అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టారిఫ్ ల ప్రభావం మార్కెట్ పై అయితే పడింది కానీ అది ఒకటి, రెండు రోజులకు మాత్రమే పరిమితం అయింది. సుంకాలు ప్రకటించిన మొదటి రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ బాగా పతనం అయింది. అయితే తరువాత అంత కంటే ఎక్కువగా పైకి లేచింది. 

వెన్నెముక అవుతున్న భారత పెట్టుబడిదారులు

భారతదేశ మధ్యతరగతి పెట్టుబడి దారులే ఇందుకు కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ లు వారిని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయానని వివరిస్తున్నారు. దీని కారణంగా భారతదేశ బెంచ్‌మార్క్ సూచీలు చాలా తక్కువ అస్థిరతను చూపించాయని చెబుతున్నారు. ఒకవైపు నుంచి విదేశీ పెట్టుబడి దారులు ఉపసంహరించుకుంటున్నా..భారత పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం దలాల్ స్ట్రీట్ ను నిలబెట్టుకుంటూ వచ్చారు. సుంకాల ముప్పు ఉన్నప్పటికీ గత ఆరు నెలల్లో రెండు ప్రధాన స్టాక్ సూచీలు 10% పెరిగాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో చెప్పింది. భారతీయ పెట్టుబడి దారులు బోంబే ఎక్స్ఛేంజ్ కు వెన్నెముకగా నిలబడుతున్నారు. భారీగా ఇన్వెస్ట్ చేస్తూ భారత వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని అందిస్తున్నారని న్యూయార్క్ టైమ్ చెబుతోంది.   

గణనీయంగా తగ్గుతున్న విదేశీ పెట్టుబడిదారులు

గత దశాబ్దంలో భారతదేశ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడి దారులు గణనీయంగా తగ్గిపోయారని.. ప్రస్తుతం వారు 24 శాతం నుండి దాదాపు 16 శాతానికి పడిపోయారని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్‌లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ హర్ష ఉపాధ్యాయ చెబుతున్నారు. ఒకప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులే పెట్టుబడులను ఆధిపత్యం చేసేవారు...అప్పుడు విదేశాల ప్రభావమే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశీయ పెట్టుబడిదారులు ఆధిక్యం చలాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ ను స్థిరీకరించడంలో స్వదేశీ సంస్థాగత, వ్యక్తిగత పెట్టుబడిదారులే మూల స్తంభాలవుతున్నారని చెబుతున్నారు. దీని వలన భారత్ విదేశీ మూలధనంపై ఆధారపడడం తగ్గుతోందని వివరించారు ఉపాధ్యాయ.  చాలామంది దీర్ఘకాలిక వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించి భారతీయ మ్యూచువల్ ఫండ్లకు నెలవారీ విరాళాలను ఆటోమేటెడ్ చేశారని న్యూయార్క్ నివేదిక చెబుతోంది. 

ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ మద్దతు

భారత పెట్టుబడిదారులకు ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోంది. సుంకాల నష్టాల నుంచి కోలుకోవడానికి దేశీయ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. అందులో భాగమే జీఎస్టీ పన్ను రేట్లను సరళీకరించడం, స్లాబులను తగ్గించడం అని చెబుతున్నారు. దీని వలన భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతి పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరుగుతోంది. అలాగే భారతీయుల ఆలోచనా ధోరణి కూడా మారిందని ముంబైలోని ASK హెడ్జ్ సొల్యూషన్స్ CEO,  ఫండ్ మేనేజర్ వైభవ్ సంఘవి చెబుతున్నారు. ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ లేదా బంగారం లో పెట్టుబడులు పెట్టే డబ్బును ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారని వివరించారు. ఈ మార్పు భారతదేశంలోని పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో మధ్యస్థ, చిన్న తయారీదారులను ప్రభావితం చేసే ఎగుమతి ప్రతిబంధకాలకు ప్రభావం కాకుండా చూస్తుంది అని చెబుతున్నారు. 

Also Read: Bihar: బీహార్ లో కాంగ్రెస్ ఎంపీ అతి..వరద బాధితుల భుజాలపై పర్యటన

Advertisment
తాజా కథనాలు