Ramachandra Paudel: నేపాల్ ప్రెసిడెంట్ రాజీనామా!

ఇటీవల నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ పదవికి రాజీనామా చేయగా తాజాగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు నేపాల్ ప్రభుత్వ అధికారాన్ని ఎవరు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

New Update
Nepal President Ramachandra Paudel resigns

Nepal President Ramachandra Paudel resigns

నేపాల్‌(Nepal) లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి 26  సోషల్ మీడియా యాప్స్‌(Social Media Apps) పై బ్యాన్ విధించగా అక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. Gen- z యువత నిరసనలు చేపట్టాయి. దేశ ప్రధాని కెపి శర్మ ఓలీ(kp-sharma-oli) ఇంటికి నిప్పు అంటించడంతో పాటు పార్లమెంట్‌లో కూడా నిప్పు అంటించారు. దీంతో ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ తన పదవికి రాజీనామా చేశారు.

ఇది కూడా చూడండి:  WhatsApp: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న వాట్సాప్.. వెబ్ సేవలకు అంతరాయం!

యాప్స్ బ్యాన్ చేయడం వల్లే..

నిషేధం విధించిన యాప్స్‌ను ఎత్తివేశారు. కానీ నిరసనలు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివెళ్తున్నారు. సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్(Social Media Apps Ban) చేయడంతో పెద్ద సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Nepal: నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు