Elon Musk - The American Party: ది అమెరికా పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..

ఎలాన్ మస్క్ మంచి జోరు మీదున్నారు. దాంతో పాటూ అధ్యక్షుడు ట్రంప్ పై పీకల దాకా కోపంతో ఉన్నారు. పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేశారు. ద అమెరికన్ పార్టీ అనేది ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు.

New Update
musk

Elon Musk - The American Party: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలన్‌ మస్క్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. 'కొత్త పార్టీ పెట్టవచ్చా' అంటూ అభిమానులను ప్రశ్నించారు. దీనిపై ఓటింగ్ కూడా పెట్టారు.  మస్క్ పెట్టిన ఓటింగ్(Elon Musk Voting)కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలంటూ 80శాతం మంది మద్దతు పలికారు. ఇది నిన్నటి మాట. ఈరోజు మస్క్ పార్టీ పెట్టడాన్ని కన్ఫార్మ్ చేసేశారు. దాని పేరును కూడా ఖరారు చేశారు. ద అమెరికన్ పార్టీ పేరుతో అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ధీటుగా కొత్త పార్టీని(Elon Musk New Party) ఎలాన్ మస్క్ తీసుకురానున్నారు.  

అమెరికాలో మేజర్ గా రెండే పార్టీలు శతాబ్ధాలుగా ఆధిపత్యంలో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీలకు మధ్యనే పోటీ ఉంటుంది. అసలు మూడో పార్టీ ఒకటి ఉంటుందనేది కూడా చాలా మందికి తెలీదు.  అమెరికాలో రిపబ్లికన్లు, డెమెక్రట్లదే  మొదటి నుంచీ ఆధిపత్యం.  ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ధీటుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి మస్క్ ఏర్పాట్లు మొదలెట్టారు.   

ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు..

ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య యుద్ధం హద్దు దాటిపోయింది. మొన్నటి వరకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు.  ఒకరికి ఒకరు హాని చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిపించానని...కానీ ఆయనకు కృతజ్ఞత లేదని ఎలన్‌ మస్క్ ఆరోపించారు. తాను లేకుంటే రిపబ్లికన్‌ పార్టీ ఓడిపోయేదని.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని మస్క్ అన్నారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కౌంటరిచ్చారు. ఎలాన్ మస్క్ లేకున్నా గెలిచేవాడినే అన్నారు. దాంతో పాటూ ఎలాన్ మస్క్ పై తీవ్రంగా మండిపడ్డారు. మస్క్ కు పిచ్చెక్కిందని ట్రంపం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ చేస్తే మస్క్‌ కాంట్రాక్టులు, కంపెనీలపై ట్యాక్సులు పెంచుతాని ట్రంప్‌ హెచ్చరించారు. 

 

Also Read: Medchal: మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు టెకీలు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు