Giorgia Meloni: మాపై లిబరల్స్‌ బురద జల్లుతున్నారు.. జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్‌ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. తనను, మోదీ, ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. తమ ఎదుగులను చూసి లిబరల్స్‌ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

New Update
Italy PM Giorgia Meloni

Italy PM Giorgia MeloniMeloni

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్‌ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సిపిఎసి)లో ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను ప్రశంసించారు. 

Also Read: ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!

ట్రంప్‌ గెలుపుతో లిబరల్స్‌ భయాందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. తనను, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను  సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. తమ ఎదుగులను చూసి లిబరల్స్‌ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ''90వ దశకంలో బిల్‌ క్లింటన్, టోన బ్లెయిర్‌ వంటివారు గ్లోబల్‌ లెఫ్టిస్ట్ నెట్‌వర్క్‌ సృష్టించారు. అప్పుడు వాళ్లని లిబరల్స్‌ రాజనీతిజ్ఞులుగా పరిగణించారు. ప్రసుతం మమ్మల్ని (మెలోని,మోదీ, ట్రంప్‌) మాత్రం ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావిస్తున్నారు.  

Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం

లిబరల్స్‌ తమపై ఎంత బురద జల్లినా కూడా ప్రజలు వాళ్ల అబద్ధాలను నమ్మడం లేదు. మమ్మల్నే గెలిపిస్తున్నారమని'' మెలోనీ అన్నారు. అలాగే డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అభివృద్ధి విషయంలో స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. బయట నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ప్రపంచ దేశాలు సంప్రదాయవాదులతోనే కలిసి ముందుకెళ్తున్నాయని కొనియాడారు. మరోవైపు ఈ సదస్సులో మెలోనీ పాల్గొనడం దుమారం రేపింది. ఈ సదస్సుకు మెలోని దూరంగా ఉండాలని ఇటలీ విపక్ష నేతలు కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆమె ఈ సదస్సుకు వర్చువల్‌గా హాజరయ్యారు. 

Also Read: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్

Also Read: మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు