Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మరో భారీ దాడి.. 34 మంది మృతి

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో 34 మంది చనిపోగా..117 మందికి గాయాలయ్యాయి. 

author-image
By Manogna alamuru
New Update
ukraine

Sumy City, Ukraine

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగడం లేదు. అగ్రరాజ్యం అమెరికా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా కూడా రష్యా ఎక్కడా ఆగనంటోంది. వరుసగా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తోంది. తాజాగా నిన్న సుమీ నగరంపై బాంబులతో విరుచుకుపడింది. రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల దాడిలో 34 మంది ఉక్రేనియన్లు మృతి చెందారు. మరో 117 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 

ట్రంప్ తమ దేశం వచ్చి చూడాలి..

రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. యుద్ధాన్ని ముగించాలని ఆ దేశం ఎంత మాత్రం అనుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలతో ఇక లాభం లేదని..ఉగ్రవాదుల పట్ల వ్యవహరించినట్లు రష్యా పట్ల కూడా చర్యలు తీసుకోవాలని చెలెన్ అన్నారు. ఈ దాడిని బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర ఐరోపా దేశాలు ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉక్రెయిన్ లో.. రష్యా దాడి వల్ల జరిగిన వినాశనాన్ని కళ్లారా చూడాలని కోరుతున్నానని ఆయన అన్నారు. రష్యా చేస్తున్న మారణహోమంలో అనేక మంది చనిపోతున్నారు. నిర్ణయాలు, చర్చలు చేపట్టేముందు వారిని చూడటానికి రండి అంటూ జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. 

today-latest-news-in-telugu | war 

Also Read: ICC: ఐసీసీ క్రికెట్ ఛైర్మన్ గా మళ్ళీ గంగూలీయే..

Advertisment
తాజా కథనాలు