ICC: ఐసీసీ క్రికెట్ చైర్మన్ గా మరోసారి సౌరవ్ గంగూలీ

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
icc

Sourav Ganguly

దుబాయ్ లో ఐసీసీ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సభ్యుల ఎంపికతో పాటూ మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఐసీసీ కమిటీ ఛైర్మన్ గా సౌరవ్ గంగూలీనా ఎన్నుకున్నారు. 2021లో దాదా ఈ ఫదవికి ఎంపికయ్యాడు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కొనసాగించనున్నారు. అలాగే మరో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నాడు. డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), హమిద్‌ హసన్‌ (అఫ్గానిస్థాన్‌), బవుమా (దక్షిణాఫ్రికా), జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) కమిటీలో ఇతర సభ్యులుగా ఉండనున్నారు. ఇక మహిళల కమిటీ ఛైర్మన్ గా కేథరిన్ క్యాంప్ బెల్(న్యూజిలాండ్) వ్యవహరించనున్నారు. కమిటీలో అవ్రిల్‌ ఫహే (ఆస్ట్రేలియా), మొసెకి (దక్షిణాఫ్రికా) సభ్యులుగా ఉన్నారు.

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ఈ సమావేశాల్లోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

మరోవైపు  ఆఫ్ఘాన్ మహిళ కోసం ఐసీసీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఆఫ్ఘాన్ లో కట్టుబాట్లు కారణంగా ప్రస్తుతం మహిళ క్రికెట్ జట్టుకు ఉనికే లేకుండా పోయింది. మళ్ళీ వారు క్రికెట్ ఆడేందుకు వీలుగా ఐసీసీ ఈ టాస్క్ ఫోర్స్ ను పెట్టింది.భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బోర్డుల సహకారంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే మహిళలకు ఈ టాస్క్ ఫోర్స్ సహాయం చేస్తుంది. 

today-latest-news-in-telugu | icc | sourav-ganguly | chairman

Also Read: USA: ఇండియన్లకు బిగ్ షాక్.. నో గ్రీన్ కార్డ్ ఫర్ ఈబీ 5 వీసా

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు