Trump-Modi: మోడీ గొప్ప ప్రధాన మంత్రి..ట్రంప్ ప్రశంసలు!
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు.
ఆయన చాలా తెలివైన వ్యక్తి .మేమిద్దరం మంచి స్నేహితులం.మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా.మీకు ..గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ లు విధించే దేశాలలో ఇండియా ఒకటి . వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా.
అయితే ఏప్రిల్ 2 న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే..నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల మోడీ యూఎస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా టారిఫ్ ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోడీతో స్వయంగా చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.ఈసందర్భంగా ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేలా..వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారత్-యూఎస్ ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లోభారత్ ధృఢవైఖరిని ప్రదర్శించింది.కొన్ని వస్తువులపైటారిఫ్ కోతలకు అంగీకరించినప్పటికీ..దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది.సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఇటీవల మీడియాతో పేర్కొన్నారు.వ్యవసాయ ఉత్పత్తులైన వాల్ నట్స్, యాపిల్, బాదం వంటి వాటి పై తగ్గింపునకు సిద్ధంగాఉన్నట్లు తెలిపారు.
అయితే భారత్ లో వ్యవసాయరంగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోధుమ,మొక్కజొన్న వంటి వాటి పై రాయితీకి అవకాశం లేదన్నారు.

pm modi donald trump Photograph: (pm modi donald trump)
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు.
Also Read: Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!
ఆయన చాలా తెలివైన వ్యక్తి .మేమిద్దరం మంచి స్నేహితులం.మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా.మీకు ..గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ లు విధించే దేశాలలో ఇండియా ఒకటి . వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా.
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
అయితే ఏప్రిల్ 2 న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే..నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల మోడీ యూఎస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా టారిఫ్ ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోడీతో స్వయంగా చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.ఈసందర్భంగా ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేలా..వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారత్-యూఎస్ ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లోభారత్ ధృఢవైఖరిని ప్రదర్శించింది.కొన్ని వస్తువులపైటారిఫ్ కోతలకు అంగీకరించినప్పటికీ..దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది.సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఇటీవల మీడియాతో పేర్కొన్నారు.వ్యవసాయ ఉత్పత్తులైన వాల్ నట్స్, యాపిల్, బాదం వంటి వాటి పై తగ్గింపునకు సిద్ధంగాఉన్నట్లు తెలిపారు.
అయితే భారత్ లో వ్యవసాయరంగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోధుమ,మొక్కజొన్న వంటి వాటి పై రాయితీకి అవకాశం లేదన్నారు.
Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
trump | modi | latest-news | telugu-news | america | bharat | latest-telugu-news | latest telugu news updates