/rtv/media/media_files/2026/03/01/pak-2026-03-01-13-49-17.jpg)
పాకిస్థాన్(pakistan) లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు. ఆందోళనకారులు కాన్సులేట్ ప్రవేశ ద్వారాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, భవనంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరాక్(iraq) రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా(america) రాయబార కార్యాలయం వద్ద కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మధ్యప్రాచ్యంలో అశాంతికి వాషింగ్టన్ కారణమని వారు ఆరోపించారు.
ఖమేనీ మరణాన్ని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో నిరసనలు చెలరేగాయి. షియా కమ్యూనిటీ నేత సయ్యద్ సమర్ కజ్మీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వంచనతో చంపాయని వారు ఆరోపించారు. పాలస్తీనాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకే ఆయనను టార్గెట్ చేశారని కాశ్మీర్ నేతలు పేర్కొన్నారు.
Also Read : తగ్గేదేలే... ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!
40 రోజుల పాటు సంతాప దినాలు
ఖమేనీ మరణాన్ని అధికారికంగా ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం, దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. తమ నేతను కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఇరాన్.. మరోవైపు ప్రతీకార చర్యలకు కూడా సిద్ధమవుతుండటంతో ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో వణుకుతోంది.
ట్రంప్ హెచ్చరికలకు భయపడబోమని ఇరాన్ స్పీకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అటు పాకిస్థాన్‌లో అమెరికా కార్యాలయంపై దాడి జరగడం చూస్తుంటే, ఈ గొడవ కేవలం ఇరాన్-అమెరికా మధ్య మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త ముస్లిం వర్సెస్ అమెరికాగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read : ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. ఎవరూ ఊహించని రీతిలో దాడులు చేస్తాం!
Follow Us