/rtv/media/media_files/2026/03/01/trump-1-2026-03-01-13-06-38.jpg)
Iran
Iran: ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) ని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్(parliament speaker) తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Also Read: శ్రీలంక క్రికెట్కు సనత్ జయసూర్య బిగ్ షాక్!
ఖమేనీ భౌతికంగా లేకపోయినా, ఆయన చూపిన విప్లవ బాటలోనే తాము నడుస్తామని ఆయన ప్రకటించారు. “ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క.. మా తదుపరి చర్య ఎలా ఉంటుందో శత్రువు ఊహించలేడు” అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ గనుక దాడులు మొదలుపెడితే శత్రువులు బెంబేలెత్తిపోవాల్సిందేనని, తమ దెబ్బకు వారు ఏడవడమే కాకుండా వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) March 1, 2026
Iran’s Mohammad Bagher Ghalibaf, Speaker of the Iranian Parliament, blasted the United States and Israel in a televised address, calling their leaders “filthy criminals” who have crossed a red line and vowing they will face “devastating blows” and be driven to beg in… pic.twitter.com/exXtIQad6G
Also Read: 47 ఏళ్లుగా అమెరికా కుట్రలు..
పంతం వీడని ట్రంప్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన పంతాన్ని వీడటం లేదు. ఇరాన్ ప్రతీకారానికి దిగాలని చూస్తే అది ఆ దేశానికే పెను ముప్పుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. “ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిది.. ఒకవేళ ప్రతిదాడులు చేస్తే అంతకంటే వెయ్యి రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని ఆయన ఇప్పటికే ఒక సంకేతాన్ని ఇచ్చారు.
ఒకవైపు ఇరాన్ స్పీకర్ హెచ్చరికలు, మరోవైపు ట్రంప్ అల్టిమేటం.. ఈ రెండింటి మధ్య ప్రపంచం ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఈ మాటల యుద్ధం ఎప్పుడు సాయుధ పోరాటంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Follow Us