Donald Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్‌ వార్నింగ్.. ఎవరూ ఊహించని రీతిలో దాడులు చేస్తాం!

ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.

New Update
Donald Trump

Donald Trump

Donald Trump: ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తమ నేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నాడు అత్యంత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు.

Also Read: తగ్గేదేలే...ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!

ఇరాన్‌ను నేరుగా హెచ్చరిక

సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఇరాన్‌ను నేరుగా హెచ్చరించారు. "ఇరాన్ ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. వారు ఆ పని చేయకపోవడమే వారికి మంచిది. ఒకవేళ ఇరాన్ గనుక ప్రతిదాడికి దిగితే, ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూడని రీతిలో మా సైనిక బలగాలతో వారిపై విరుచుకుపడతాం. ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు" అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రజలను రక్షించుకోవడానికి, ఇరాన్ అణు ముప్పును అరికట్టడానికి సైనిక చర్య తప్పలేదని ఆయన సమర్థించుకున్నారు.

Also Read: యూట్యూబ్ తుక్కు రేగ్గొట్టిన నాని 'ఆయా షేర్'..

భద్రతా దళాలకు ఆఫర్

కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా, ఇరాన్ భద్రతా దళాలకు ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు కింద పడేసి లొంగిపోండి.. లేదంటే చావు తప్పదంటూ  ఇరాన్ సైనికులకు అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..యుద్ధం తగ్గాక మీ ప్రభుత్వాన్ని మీరే చేతుల్లోకి తీసుకోండి, తిరగబడండి అని పిలుపునిచ్చారు. 

Advertisment
తాజా కథనాలు