మవోయిస్ట్ మరో అగ్రనాయకురాలు సరెండర్.. ఆమెపై రూ.5లక్షల రివార్డ్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు ఉన్న టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. తూర్పు బస్తర్ ప్రాంతంలో 'టైలర్ టీమ్' నాయకురాలిగా గీత పనిచేసింది.

New Update
Maoist Commander Geeta

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ 'నక్సలిజం నిర్మూలన విధానం' పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగానే ఆమె లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. తూర్పు బస్తర్ ప్రాంతంలో 'టైలర్ టీమ్' నాయకురాలిగా పనిచేసిన గీత, పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించింది. కొండగావ్ జిల్లా ఎస్పీ అక్షయ్ కుమార్ సమక్షంలో ఆమె ఆయుధాలు వీడింది. మావోయిస్ట్ ఉద్యమంపై నమ్మకం కోల్పోవడం, అలాగే ఇటీవల పెద్ద సంఖ్యలో అగ్రనేతలు లొంగిపోవడంతో ప్రేరణ పొంది తాను కూడా జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొంది.

లొంగిపోయిన వెంటనే, గీతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.50,000 చెక్కును అందించారు. ఛత్తీస్‌గఢ్ నక్సలిజం నిర్మూలన విధానం కింద ఆమెకు పూర్తిస్థాయి పునరావాస ప్రయోజనాలు కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. గీత లొంగుబాటు కేవలం ఒక రోజు వ్యవధిలోనే జరిగింది. అంతకుముందు రోజు, మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు సహా 210 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఎదుట ఆయుధాలు వదిలి లొంగిపోయారు. ఈ వరుస లొంగుబాట్లు రాష్ట్రంలో భద్రతా బలగాలు చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’ విజయానికి నిదర్శనమని, మావోయిస్టు ఉద్యమం తమ పట్టును కోల్పోతోందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు