/rtv/media/media_files/2025/04/12/l5Uyavcu3swkD5Bv1q8x.jpg)
Earthquake Photograph: ( Earthquake )
ఇటీవల కాలంలో తరుచుగా ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు(earthquake) సంభవిస్తున్నాయి. ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రాంతంలో భూంకంపాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వెనెజువెలాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయింది. భూకంప భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.39 నిమిషాలకు వెనెజువెలా నైరుతి ప్రాంతంలో 6.2 తీవ్రతతో బలమైనఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావంతో భారీ భవనాలను అతాకుతలం అయ్యాయి.
Massive Earthquake Hits Venezuela
వెనెజువెలా(Venezuela) లోని అనేక రాష్ట్రాలతో పాటు, పొరుగు దేశమైన కొలంబియాలోనూ భూకంప తీవ్రత కనిపించింది. భూకంప భయంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు ఖాళీ చేసి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఆందోలనలో ఉన్నారని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. కాగా భూకంప కేంద్రం జులియా రాష్ట్రంలోని మెనెగ్రాండే (Menegrande) నుంచి 24 కి.మీ తూర్పు ఈశాన్య ప్రాంతంలో, కారకాస్‌కు 00 కి.మీపైగా పశ్చిమంలో 7.8 కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించారు.
బ్యాంకక్‌లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరిగినట్లుగా యుఎస్‌జీఎస్ స్పష్టం చేసింది. అయితే, భూకంప కేంద్రమైన మెనెగ్రాండే అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నప్రాంతం కావడం గమనార్హం. ఇది వెనెజువెలా (Venezuela) చమురు పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉందని తెలుస్తోంది. అయితే, ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Bathukamma 2025: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!