Watch Video: అయ్యో.. రూ.8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన వెంటనే ఘోర ప్రమాదం

టర్కీలోని జోంగుల్డాక్‌ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

New Update
Luxury Yacht Sinks

Luxury Yacht Sinks

టర్కీలోని జోంగుల్డాక్‌ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి మెడ్‌ యిల్మాజ్‌ షిప్‌యార్డ్‌లో ఈ నౌకను నిర్మించారు. ఇందుకోసం 1 మిలియన్ డాలర్లు(రూ.8.74 కోట్లు) ఖర్చయ్యింది. అయితే మంగళవారం కొందరు ప్రయాణికులు, సిబ్బందితో ఆ నౌక ప్రారంభమయ్యింది. 

Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

 ప్రారంభమైన 15 నిమిషాలకే ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే నౌక మునిగిపోతున్న క్రమంలో దాని యజమాని, కెప్టెన్ కూడా నిరుత్సాహంగా ఉండిపోయాడు. చివరికి ఆయన కూడా సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారు. అయితే నౌక మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. దీనిపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.   

Also Read: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

Advertisment
తాజా కథనాలు