Hollywood: హాలీవుడ్‌ ప్రముఖులపై మండిపడుతున్న జనాలు!

కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. కానీ హాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం నీటిని విచ్చలవిడిగా వినియోగించడంతో ప్రజలు మండిపడుతున్నారు.

New Update
us california

california

ఎటు చూసినా ఎగసిపడుతున్న మంటలు...అన్ని పక్కల నుంచి చుట్టుముట్టిన దట్టమైన పొగ..మంచులా పడుతున్న బూడిద. హాలీవుడ్‌ (Hollywood) అగ్ర తారలంతా నివసించే ప్రదేశం...సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్ ఏంజెల్స్‌ లో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆరుచోట్ల దావానలం వ్యాపించింది.

Also Read :  మోదీ చేతుల మీదుగా నేడు జడ్‌ మోడ్‌ టన్నెల్ ఓపెనింగ్

లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) లో మొదలైన ప్యాలిసెడ్స్‌ వైల్డ్‌ ఫైర్‌పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది.ఆ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళాలు వాటిశక్తికి మించి కష్టపడుతున్నాయి.ఇదంతా ఇలా ఉంటే నీటి కొరత వల్ల ఫైర్‌ హైడ్రంట్స్‌ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రావట్లేదు.దీంతో ఈ ముప్పు నుంచి తమ నివాసాలను కాపాడుకోవడానికి హాలీవుడ్‌ ప్రముఖులు,విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టే అపర కుబేరులు ప్రైవేటు ఫైర్‌ఫైటర్లకు గంటకు రూ.1.72లక్షలు.. అంటే రోజుకు దాదాపు రూ.40లక్షలు కూడా చెల్లించడానికి కూడా రెడీగా ఉన్నారు.

Also Read :  బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్

Also Read :  ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

Los Angeles

దీంతో  వారిపై  ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం వారేనంటూ  సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనది.. ఇంటి చుట్టూ ఉండే పచ్చికకు, మొక్కలకు వారానికి రెండుసార్లు.. అదీ కేవలం 8 నిమిషాల చొప్పున మాత్రమే నీరు పెట్టాలనే నిబంధన కఠినతరం చేశారు. దాన్ని ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

కానీ హాలీవుడ్‌ సెలబ్రిటీల్లో ఒకరైన కిమ్‌ కర్దాషియన్‌ తన ఇంటి తోటకు వాడాల్సినదానికన్నా అదనంగా 8 లక్షల లీటర్లకు పైగా నీటిని వాడారు. కిమ్‌ కర్దాషియన్‌ మాత్రమే కాదు.. లాస్‌ ఏంజెలెస్‌ లో నివసించే సిల్వెస్టర్‌ స్టాలోన్‌, ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌, పారిస్‌ హిల్టన్‌, బిల్లీ క్రిస్టల్‌, ఆంథోనీ హాప్కిన్స్‌, మెల్‌ గిబ్సన్‌, తదితర సెలబ్రిటీలు, సంపన్నులందరిదీ అదే పద్ధతి అని తెలుస్తుంది.

Also Read :  అదిరింది కదూ .. ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో విందు

నీటి కొరతతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఈ సెలబ్రిటీలు అంత విచ్చలవిడిగా నీటిని వాడేయడంపై సామాన్యుల్లో చాలాకాలంగా ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తుంది. ‘‘ఒకవైపు లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను  ఖాళీ చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటే.. ప్రాణాలు కాపాడే నీటివనరులను ‘కేవలం’ మీ విలాసవంతమైన భవనాలను కాపాడుకోవడానికి ఉపయోగించాలని  అనుకుంటున్నారన్నమాట’’ అంటూ కోప్పడుతున్నారు.

కాలిఫోర్నియా (California) ను వణికిస్తున్న పాలిసేడ్స్‌, ఈటన్‌ కార్చిచ్చుల కారణంగా ఇప్పటిదాకా 24 మంది మరణించగా.. 12,300 ఇళ్లు, వ్యాపార నిర్మాణాలు బూడిదయ్యాయి. మరో 57 వేల నిర్మాణాలకు దావాగ్ని ముప్పు పొంచి ఉంది. దాదాపు 35 వేల ఇళ్లు/వ్యాపారసముదాయాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పాలిసేడ్స్‌ దావానలం 23,707 ఎకరాల అడవిని దహించగా.. ఈటన్‌ కార్చిచ్చు కారణంగా 14,117 ఎకరాల అటవీప్రాంతం కాలి బూడిదయ్యింది. ఆ ప్రాంతాల్లోని రెండు లక్షల మందిని వేరేప్రాంతాలకు తరలించారు.

 మరో లక్షన్నర మంది తరలింపునకు ఆదేశాలిచ్చారు. అగ్నిమాపక దళాలు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా పాలిసేడ్స్‌లో , ఈటన్‌లో మంటలను కొంత మేర అదుపులోకి తీసుకుని వచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా.. ఆ ప్రాంతంలో బలమైన ‘శాంటా అనా గాలులు’ మరోసారి వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో  ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది.

కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ ఈ దావానలాలను అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి ఉత్పాతాలుగా అభివర్ణించారు. పాలిసేడ్స్‌, ఈటన్‌లో కార్చిచ్చు అదుపులోకి రాక పోయినప్పటికీ.. కెన్నెత్‌లో పూర్తిగా, హర్స్ట్‌లో కొంత మేర మంటలు అదుపులోకి రావడం ఊరట కలిగించే విషయం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు