బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్

బాలకృష్ణ హీరోగా నటించిన  డాకు మహారాజ్ మూవీ ఆన్లైన్ లో దర్శనమిచ్చింది.  పైరసీ సైట్లలో HD ప్రింట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అటు రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ సినిమా కూడా రిలీజైన రెండో రోజే ఆన్లైన్ లో పెట్టేశారు.

New Update
Daaku Maharaaj leak

Daaku Maharaaj leak Photograph: (Daaku Maharaaj leak)

సినిమా ఇండస్ట్రీని పైరసీ బూతం వీడడం లేదు. మేకర్స్, పోలీసులు కఠిన చర్యలు తీసుకున్న పైరసీని మాత్రం ఆపలేకపోతున్నారు.  తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన  డాకు మహారాజ్ మూవీ ఆన్లైన్ లో దర్శనమిచ్చింది.  పైరసీ సైట్లలో HD ప్రింట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.  దీంతో ఈ పైరసీని ఆపాలంటూ మూవీ మేకర్స్ కు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు.  

అటు రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ సినిమాను కూడా పైరసీ బూతం వెంటాడింది.  హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది.  దీంతో అంతా షాక్ అయిపోయారు.  తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రాం,ఐబోమ్మ లాంటి వెబ్ సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమా ప్రింట్ ను  సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్

మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన  డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది.  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతంచేసుకుంటుంది. ఎప్పటిలాగే సినిమాలో బాలయ్య  పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే జరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రింట్ పైరసీ రూపంలో బయటకు రావడంతో ఫ్యాన్స్, మేకర్స్ లో ఆందోళన నెలకొంది. 

Also read :  కాఫీ తాగితే ఆయుష్షు డబుల్‌.. ఇది నిజం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు