AI Robo: ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్ వచ్చేసింది.. సింగిల్స్‌కు పండగే

అమెరికాకు చెందిన ఓ టెక్‌ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. ధర 1,75,000 డాలర్లు (రూ.1.5 కోట్లు).పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది.

New Update
AI Robo

AI Robo

సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు అర్టిఫిషియల్ ఇంటిలెజన్స్ సేవలు వినియోగించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా విస్తరించనుంది. అలాగే రోబోటిక్ సేవలు కూడా పెరిగిపోతున్నాయి. పలు కంపెనీలు మనుషులు చేసే పనులను రోబోలతో చేయించుకుంటున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ టెక్‌ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. 

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

ఈ రోబో ధర 1,75,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1.5 కోట్లు. ఇది అచ్చం మనుషులను పోలి ఉన్నట్లే ఉంది.  పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది.  ఇక వివరాల్లోకి వెళ్తే.. లాస్‌ వెగాస్‌లో జరుగుతున్న ''2025-కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌'' షోలో రియల్ బోటిక్స్‌.. రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను ఆవిష్కరించింది. అంతేకాదు ఈ రోబోకు ఆరియా అనే పేరు కూడా పెట్టారు. 

Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

దీనిపై కంపెనీ సీఈవో ఆండ్రూ కిగ్వెల్‌ మాట్లాడారు. '' పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసేలా. మనుషుల నుంచి వేరు చేయలేని విధంగా ఉండే ఓ రోబోను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాం. ఇంతవరకు ఎవరూ కూడా చేయని విధంగా భావోద్వేగాలు పంచుకునేలా రియలిస్టిక్ రోబోను తయారుచేశామని'' తెలిపారు. ఆరియా కొంతమందికి మనోహరమైనది.. మరికొందరికీ మాత్రం భయంకరమైనదంటూ చమత్కారం చేశారు.  

Also Read: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

Also Read: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు