Ali Khamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం.. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్‌ చేశారు.

New Update
Ali Khamenei

Ali Khamenei

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ(khameni vs trump) 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్‌ చేశారు. ప్రతి సంవత్సరం ఆయన ఫిబ్రవరి 8న ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్లతో సమావేశం అవుతుంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఆ భేటీలో పాల్గొనలేదు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.

Also Read: ఒకపుడు రైజింగ్ బిజినెస్‌ స్టార్‌..నేడు కటకటాల్లోకి..

Khamenei Breaks 37 Year Old Ritual

1989లో ఆయన సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏటా ఫిబ్రవరి 8న ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్లతో జరిగే భేటీకి హాజరవుతూ వస్తున్నారు. చివరికి కరోనా సమయంలో కూడా ఆయన ఈ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఈ ఏడాది ఆయన దీన్ని మిస్‌ చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్స్‌ సమావేశానికి సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్‌రహీం మౌసావి హాజరైనట్లు తెలుస్తోంది. - ali khameni

Also Read: జపాన్‌లో చరిత్ర సృష్టించిన తొలి మహిళా ప్రధాని.. చెప్పి మరీ కొట్టింది

అమెరికా, ఇరాన్‌(iran) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇరాన్‌లో తమ సైనిక ఉనికిని విస్తరిస్తోంది. అలాగే ఆ దేశంపై సైనిక దాడులు చేయవచ్చనే భయాలు కూడా నెలకొన్నాయి. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు సుప్రీం లీడర్ బహిరంగంగా కనిపించడం లేదని కొందరు భావిస్తున్నారు. లేదా జాతీయ భద్రతా విషయంలో ఆయన నిమగ్నమై ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. మరోవైపు అమెరికా తమపై దాడులు చేస్తే మిడిల్‌ఈస్ట్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని ఇరాన్‌ పదేపదే హెచ్చరిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు