/rtv/media/media_files/2025/09/06/gujarat-teacher-arrested-for-molesting-11-years-old-bot-in-amreli-2025-09-06-19-32-55.jpg)
gujarat teacher arrested for molesting 11 years old bot in amreli
గుజరాత్‌లో ఘోరం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్రేలి జిల్లాలో విద్యా ప్రపంచానికి సిగ్గుచేటు తెచ్చిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జిల్లాలోని బాబ్రాలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ 11 ఏళ్ల విద్యార్థిపై అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హోంవర్క్ ఇవ్వనని చెప్పి.. బాలుడిని భయపెట్టి అసభ్యకరమైన పనులు చేశాడు. చివరికి ఈ విషయం బయటకు రావడంతో కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
అతడి పేరు శైలేష్ ఖుంట్. ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు కూడా. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాల్సింది పోయి.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందులో భాగంగానే 11 ఏళ్ల బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ చిన్నారి బాలుడు రెండు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. ఏమైందని ఇంట్లో తల్లిదండ్రులు ప్రశ్నించగా.. వారిముందు ఏడవడం స్టార్ట్ చేశాడు.
అనంతరం తల్లిదండ్రులు పదే పదే ప్రశ్నించడంతో బాలుడు భయంతో ప్రిన్సిపాల్ గురించి మొత్తం నిజాన్ని వెల్లడించాడు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలేష్ ఖుంట్ గత ఒక సంవత్సరం నుండి తనతో అసభ్యకరమైన ప్రవర్తనలకు పాల్పడుతున్నాడని బాలుడు చెప్పాడు. దీంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు 2024 నుండి బాబ్రా తాలూకాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని.. వారి గ్రామం నుండి దాదాపు 30 నుండి 35 మంది పిల్లలు ఈ పాఠశాలకు చదువుకోవడానికి వెళ్తున్నారని తెలిపింది.
A 39-year-old school administrator and teacher, Shailesh Khunt, was arrested on Wednesday for alleged repeated aggravated sexual assault on an 11-year-old boy, a Class 7 student, over a period of a year.
— The Times Of India (@timesofindia) September 6, 2025
More details 🔗https://t.co/FputjePHYFpic.twitter.com/Mb4h5cWG4I
ఆపై బాదిత బాలుడు పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించాడు. నిందితుడు తనకు ఒంటరిగా ఫోన్ చేసేవాడని వెల్లడించాడు. అతడు తనను పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌కు, పాఠశాల వెనుక, పైకప్పుకు, పాత బాత్రూమ్‌కు తీసుకెళ్లి తన శరీరాన్ని తాకి లైంగికంగా వేధించేవాడని వెల్లడించాడు. అంతేకాకుండా ప్రైవేట్ భాగాన్ని తాకి ముద్దు పెట్టుకునేవాడని తెలిపాడు.
అక్కడితో ఆగకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. భయపెట్టేవాడని తెలిపాడు. ‘‘ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పకు.. స్కూల్లో నేను నీకు ఏమీ చెప్పను.. హోంవర్క్ కూడా ఇవ్వను’’ అని ప్రిన్సిపాల్ చెప్పాడని పేర్కొన్నాడు. దీంతో వారు సైలెంట్‌గా ఉండిపోయామని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు నిందితుడైన ప్రిన్సిపాల్‌పై BNS, POCSO చట్టంలోని సెక్షన్ 8, 10 కింద కేసు నమోదు చేశారు.
అనంతరం పోలీసులు వెంటనే నిందితుడైన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుండి అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇతర పిల్లలతో కూడా ఇలాంటి సంఘటన జరిగిందా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.