Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 69 మంది మృతి

గాజాలోని నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 69 మంది మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాలస్తీనా సివిల్ డిఫెన్స్ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం.

New Update
=]Gaha

గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు చేయడంతో గాజా ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తు్న్నారు. వరుస దాడులతో గాజా అతలాకుతలం అయ్యింది. మళ్లీ తాజాగా గాజాలోని నాలుగు పాఠశాలలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందారు. వీరితో మరికొందరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పాలస్తీనా సివిల్ డిఫెన్స్ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

భూకంపం కంటే భయంకరంగా..

మరోవైపు సిరియాపై కూడా ఇజ్రాయెల్ పెద్ద దాడి చేసింది. కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా సిరియాలో భూకంపం సంభవించిన దాని కంటే ఎక్కువగా శబ్ధం వచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పేలుడు నుంచి వచ్చిన మంట కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. గత కొన్నేళ్ల నుంచి సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. 2012 నుంచి చేసిన దాడుల్లో ఇదే పెద్దదని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు