CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు

ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్‌కు  ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.

New Update
maoist na

maoist na Photograph: (maoist na)

CPI (Maoist) : ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్‌కు  ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా ఆపరేషన్‌ కగార్‌ పేరుతో దేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు భారీ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుంది, అయితే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీ కేంద్రం పట్టించుకునే పరిస్థితిల లేదు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

మరోవైపు ఛత్తీస్ గఢ్‌ లో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టులు అక్కడ కూడా తమ ఉనికిని కోల్పొయే ప్రమాదంలో పడింది. అందులో భాగంగా మావోయిస్టులకు బలమైన కేంద్రంగా ఉన్న  అబుజ్‌మడ్‌లో భద్రతా దళాలు కాలుమోపాయి. అక్కడ మావోయిస్టు అధినేత నంబాల కేశవరావును మట్టుబెట్టాయి. గడచిన ఆరునెలల్లో  చత్తీస్‌గఢ్‌తో పాటు నక్సల్స్‌ ప్రభావం ఉన్న పలు రాష్ట్రాల్లో వందలాది మందిని పోలీసులు ఎన్‌ కౌంటర్లలో కాల్చి చంపారు. చాలామంది లొంగిపోయారు. దాదాపు మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకు పోయిన పరిస్థితి ఏర్పడింది. చత్తీస్‌గఢ్ పై భద్రతా దళాలు పట్టుసాధించడంతో మావోయిస్టులు నేషనల్‌ పార్కుకు మకాం మార్చారు. కానీ కేంద్ర బలగాలు అక్కడ కూడా అటాక్‌ చేసి పలువురు అగ్రనాయకులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు మధ్యప్రదేశ్‌ వైపు వెళ్లడంతో అక్కడ కూడా ఎన్‌కౌంటర్లు సాగుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాలు చేపడుతున్న కాల్పులను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు.  ఈ క్రమంలో ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. మావోయిస్టు  బంద్‌ నేపథ్యంలో అప్రమత్తమైన బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో మావోయిస్టుల ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఈ బంద్‌కు అంత ప్రాధాన్యత ఉండదని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు