/rtv/media/media_files/2025/02/13/Z9OABLg8MFdfwmyDlhzL.jpg)
Israel Says Will Implement Trump's Gaza Plan If Hostages Not Freed
Israel Warning: అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump), ఇజ్రాయెల్(Israel).. హమాస్(Hamas) వద్ద ఉన్న బందీలను శనివారం నాటికి రిలీజ్ చేయాలని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇజ్రాయెల్ మరో ప్రకటన చేసింది. ఈ వారం చివర్లో తమ బందీలను విడుదల చేయకుంటే యుద్ధం మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. '' కొత్త యుద్ధం మొదలవుతుంది. బందీలను విడిచిపెట్టేవరకు పోరాటం ఆగదు. గాజా స్వాధీనం చేసుకునే అంశంపై ట్రంప్ ప్రణాళికను అమలు చేస్తామని'' కాట్జ్ తెలిపారు.
Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!
ఈజిప్టు, ఖతర్ మధ్యవర్తిత్వం వల్ల గత నెలలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హమాస్ తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా పౌరులను విడిచిపెడుతోంది. ఇప్పటిదాకా వివిధ దశల్లో 21 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇక ఇజ్రాయెల్ ఇప్పటిదాకా 730 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది.
ఈ నేపథ్యంలోనే తదుపరి బందీల విడుదలను శనివారం నిర్ణయించింది. అయితే హమాస్ తాజాగా ఓ అనూహ్య ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని..బందీల విడుదలను తాము ఆలస్యం చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఇజ్రాయెల్‌తో పాటు ట్రంప్ కూడా హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. బందీల విడుదలను హమాస్ ఆపితే.. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేవరకు మేము పోరాడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియోలో అన్నారు.
Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!
హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక..
గాజా లోపల, బయట బలగాలను సమీకరించాలని IDFను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ హమాస్ శనివారం బందీలను విడిచిపెట్టకుంటే మళ్లీ ఎప్పట్లాగే ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతాయనే ఆందోళన నెలకొంది. ఇదిలాఉండగా.. గాజాను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిరాశ్రయులైన పాలస్తీనియన్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా హమాస్ ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీకి పిలుపునిచ్చింది. బలహీన కాల్పులు విరమణ ఒప్పందంతో బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్, అమెరికా తమను బెదిరిస్తున్నాయని, వీటికి తలొగ్గే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది.
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!