Cricket: వర్క్ లోడ్ సాకు ఇక చెల్లదు..బీసీసీఐ కొత్త నిర్ణయం

ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాగా పడుతోంది. అందుకే ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పాలనుకుంటోంది బీసీసీఐ. 

New Update
bcci

bcci Photograph: (bcci )

కొత్త రూల్స్ కు స్వాగతం చెబుతోంది బీసీసీఐ. టీమ్ ఇండియా ప్రదర్శన ఎక్కడా ఫెయిల్ అవ్వగుండా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ను తీసేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు టీమ్ లోని స్టార్ క్రికెటర్లు వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ అంటూ కొన్ని సీరీస్ లకు దూరంగా ఉంటున్నారు. మరికొంత సీరీస్ లో పాల్గొంటున్నా కొన్ని మ్యాచ్ లు ఆడడం లేదు. దీని వలన భారత జట్టు కొన్ని మ్యాచ్ లు బ్రహ్మాండంగా ఆడుతుంటే..మరికొన్ని చాలా పేలవమై ప్రదర్శనతో తేలిపోతున్నాయి. అందుకే వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ విధానానికి స్వస్తి పలకాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి కోచ్ గంభీర్ తో పాటూ సెలక్షన్ కమిటీ, మరికొంత మంది పెద్దలు కూడా మద్దతు పలుకుతున్నారని చెబుతున్నారు. 

Also Read: Russia-USA: ట్రంప్ తొందరపాటు..అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్..

ఇంకా నిర్ణయం సెలక్షన్ కమిటీదే..

దీనిపై ఇప్పటికే చాలా చర్చలు జరిగాయని తెలుస్తోంది. దీని బట్టి ఇక మీదట సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్ళకు, ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో ఆడే రెగ్యులర్ ఆటగాళ్లందరికీ మ్యాచ్‌లను ఎంచుకునే ఫెసిలిటీ భవిష్యత్తులో ఉండదని తెలుస్తోంది. ఎవరు ఏఏ మ్యాచ్ లు ఆడాలన్నది బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. అలా అని ఆటగాళ్ళకు అస్సలు రెస్ట్ ఇవ్వకుండా కూడా ఉండకూడదని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఛాయిస్ అనేది ఆటగాళ్ళకు మాత్రం ఉండదని తెలుస్తోంది. నిష్పక్షపాతంగా సెలక్షన్ కమిటీనే వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ను అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. పనిభార నిర్వహణ సాకుతో కీలక మ్యాచ్‌లకు దూరంగా ఉంటామంటే అందుకు అంగీకరించేది లేదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Indus Delta Crisis Pakistan: డేంజర్‌లో పాకిస్తాన్.. సింధూ నది డెల్టాలోకి ఉప్పు నీరు.. ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న రైతులు

కొందరిపై పని భారం..

ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ తో పాటూ అంతకు ముందు జరిగిన కొన్ని మ్యాచ్ లు ఈ నిర్ణయానికి కారణం అయ్యాయని తెలుస్తోంది. ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో స్టార్ పేసర్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడడం..మరోవైపు సిరాజ్ మాత్రం ఐదు మ్యాచ్ లూ ఆడి ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ సీరీస్ లో అందరి కంటే సిరాజ ఎక్కువగా ఓవర్లు వేసాడు. కెప్టెన్ ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా కాదనకుండా చేశాడు. సీనియర్ క్రికెటర్ గవాస్కర్ కూడా ఈ విషయాన్ని మెచ్చుకున్నారు. అలాగే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ విధానానికి స్వస్తి పలకాలని కూడా సలహా ఇచ్చారు.  దీన్నే బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకే భవిష్యత్తులో ఈ విధానానికి ముగింపు పలకాలని అనుకుంటోంది. 

ఇది కూడా చూడండి: Donald Trump: మరో 24 గంటల్లో భారత్‌పై భారీ టారిఫ్‌లు.. ఈ వైఖరి మార్చుకోకపోతే సుంకాల తప్పవని ట్రంప్ బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు