Russia-USA: ట్రంప్ తొందరపాటు..అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపించాలనే తపనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నాయి. జలాంతర్గాముల మోహరింపుతో ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఇది ఇప్పుడు ఐరోపాకు తలనొప్పిగా మారింది.

New Update
Trump VS Putin

Trump VS Putin

ట్రంప్ నిర్ణయాలు ఐరోపాకు తలనొప్పిగా మారాయి. ఉద్దేశం మంచిదే అయినా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోకుండా అమెరికా అధ్యక్షుడు తప్పులో కాలేస్తున్నారు. రష్యాను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న పద్ధతులు ఐరోపాకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రష్యా తీరంలో రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇది రష్యాకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో నిన్నటి నుంచి ఆ దేశం అమెరికాను హెచ్చరిస్తునే ఉంది. అణు ఒప్పందాలను అమెరికా రెచ్చగొడుతోంది అంటూ వ్యాఖ్యలు చేస్తోంది. దానికి తగ్గట్టు ఈరోజు రష్యా ఐఎన్ఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్‌ ఇక అనుసరించబోమని రష్యా తేల్చి చెప్పేసింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని ఆరోపించింది. ఈక్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని స్పష్టం చేసింది.

ఐఎన్ఎఫ్ ఒప్పందం..

1987లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, రష్యా అధినేత మిఖాయిల్‌ గోర్బచేవ్‌  ఈ ఒప్పందంపై సంతకం చేశారు. అప్పటి నుంచి రెండు దేశాలు దీన్ని పాటిస్తూ వస్తున్నాయి. దీన్నే ఇంటర్మీడియట్‌ రేంజి న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీ అని కూడా అంటారు. భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజి క్షిపణుల మోహరింపు ఈ ఒప్పందంలో ఉంది. 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల మధ్యలో క్షిపణులను ప్రయోగించకూడదు. ఈ రేంజ్ లో క్షిపణులు ప్రయోగిస్తే ఐరోపా దేశాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆ దేశాలు ఎఫెక్ట్ అుతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయితే ఈ ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి 2019లో అమెరికాను తప్పించారు ట్రంప్. రష్యా దీన్ని పాించడం లేదనే సాకును చెప్పారు. 9ఎం729 లేదా ఎస్‌ఎస్‌సీ-8 క్షిపణులను మోహరించిందని చెప్పారు అయితే రష్యా ఈ ఆరోపణలను తిరస్రరించింది. కానీ ఒప్పందాన్ని మాత్రం కంటిన్యూ చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ జలాంతర్గాములను మోహరించడంతో రష్యాకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఐఎన్ఎఫ్ నుంచి బయటకు వచ్చేస్తున్నామని ప్రకటించింది. అటు అమెరికా, ఇటు రష్యా రెండు దేశాలు ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చి క్షిపణుల ప్రయోగాలు చేసుకుంటే మధ్యలో మాడి మసి అయిపోయేది ఐరోపా దేశాలు మాత్రమే. అందుకే ఇప్పుడు వాటి గుండెల్లో దడ మొదలైంది. 

భారత్ కు మద్దతు..

మరోవైపు భారత్ పై ట్రంప్ చేస్తున్న టారీఫ్ ల బెదిరింపుల మీద కూడా మాస్కో స్పందించింది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు అన్యాయమైన ఒత్తిడి తీస్తుకువస్తున్నారని అంది. ఇటువంటివి నైతికంగా బెదిరింపులు.. రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం చట్టబద్ధమైనవిగా భావించమని క్రెమ్లన్ ప్రతినిధి పెస్కోవ్ అన్నారు. భారత్ కు రష్యా మద్దతుగా ఉంటుందని చెప్పారు. తమ దేశానికి ఏది కావాలో నిర్ణయించుకునే అధికారం, హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని ఆయన అన్నారు. 

ఇది కూడా చూడండి: Donald Trump: మరో 24 గంటల్లో భారత్‌పై భారీ టారిఫ్‌లు.. ఈ వైఖరి మార్చుకోకపోతే సుంకాల తప్పవని ట్రంప్ బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు