/rtv/media/media_files/2026/03/02/israel-2026-03-02-10-50-10.jpg)
Israel bombs Beirut after Hezbollah launches rocket attack
ఓవైపు ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(iran-israel) మరోవైపు లెబనాన్‌పై కూడా విరుచుకుపడుతోంది. రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఈ దాడులు చేపట్టింది. ముందుగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లాకు చెందిన అల్ మనార్ నెట్‌వర్క్ ప్రకటించింది. ఈ దాడుల తర్వాతే ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి హెజ్‌బొల్లా తమపై దాడులు చేసిందని.. అందుకే తాము కూడా వైమానిక దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: భీకర యుద్ధం.. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు.. షాకింగ్ వీడియో
Israel Bombs Beirut
అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు అల్ మనార్ నెట్‌వర్క్ సోమవారం తెల్లవారుజామున వెల్లడించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాతే దక్షిణ బీరుట్‌లో ఉన్న పలు గ్రామాలతో పాటు హెజ్‌బొల్లా స్థావరాలపై IDF దాడులు చేసింది.
Israeli forces launched strikes on Lebanon, including the capital, Beirut, on Monday, the military said, after Tehran-backed militant group Hezbollah fired rockets at Israel in retaliation for the killing of Iran's supreme leader. The Israeli strikes followed rocket and drone… pic.twitter.com/WHEAN3qOTk
— The Hindu (@the_hindu) March 2, 2026
#Israel attack #Iran: #Lebanon’s PM has described the latest rocket fire on Israel as “irresponsible and suspicious”, after tensions flared sharply along the border. Israel launched a barrage of air strikes on Beirut early on Monday following missile attacks claimed by the… pic.twitter.com/yujlt6ykFJ
— The Times Of India (@timesofindia) March 2, 2026
Also Read: మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
లెబనాన్‌ను హెజ్‌బొల్లా నాశనం చేస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది. దీన్ని అరికట్టేందుకే తాము హెజ్‌బొల్లా ఉగ్రసంస్థలోని కీలక నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. హెజ్‌బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్‌లోని 50 పైగా గ్రామ ప్రజలకు సూచనలు చేసింది.
Follow Us