లెబనాన్, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 15 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తమపై దాడులకు పాల్పడ్డ హమాస్, హెజ్‌బొల్లాను అంతం చేసేవరకు వదిలేది లేదని ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు గాజాపై, మరోవైపు లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు Israel Air Strikes లెబనాన్ రాజధాని అయిన బీర్‌ట్ శివార్లో ఓ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు పాల్పడింది. ఆ విమానశ్రయాంలో ఒక విమానం రన్‌వేపై టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే దానికి సమీపంలో ఉన్న జనావాసాలపై ఇజ్రాయెల్ మిస్సైల్‌తో దాడి చేసింది. దీని ప్రభావానికి అక్కడున్న భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ బాంబు దాడికి అక్కడున్న స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. మరికొందరు ఆ భవనాల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. Also Read : టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! View this post on Instagram A post shared by Al Jazeera English (@aljazeeraenglish) మరోవైపు గాజాలోని అల్ మవాసీ అనే ప్రాంతంలో ఓ టెంట్ క్యాంప్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ప్రస్తుతం గాజాలో జరుగుతున్న దాడులకు పాలస్తీనా ప్రజలు శిబిరాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. దీన్నీ సేఫ్ జోన్‌గా కూడా పిలుస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మిస్సైల్‌తో దాడి చేసింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. దీని ప్రభావానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. దాదాపు 100 టెంట్లకు పైగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే View this post on Instagram A post shared by Al Jazeera English (@aljazeeraenglish) Also Read : గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం #gaza #international #israel-attack #lebanon #national మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి