Lover: గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం

కర్నూల్‌ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది.

New Update
lover cheating his girlfriend

ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు దారితీసింది. ఇంట్లో కూడా ఒప్పించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు చేసిన పనికి ప్రియురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇంతకీ ప్రియుడు ఏం చేశాడో అనే విషయానికొస్తే.. 

Also Read :  డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

పరిచయం కాస్త ప్రేమగా

కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగరంలో బుడిగే నాగరాజు, నాగవేణిల దంపతులు నివాసముంటున్నారు. వీరి కూమారుడైన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో మైసూరుకు చెందిన మంజునాథ్, పుష్పలతల కూతురు చందన కూడా అదే కంపెనీలో జాబ్ చేస్తుంది. ఓ రోజు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 

Also Read : 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!

Also Read :  వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!

ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. అదే క్రమంలో వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి ఆదోనిలో నిశ్చితార్థం చేసుకున్నారు. అంతేకాకుండా వీరి పెళ్లికి కూడా ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 14 అంటే వచ్చే నెలలోనే వీరి పెళ్లి జరగనుంది. దీంతో అమ్మాయి చందన అప్పటి నుంచి అబ్బాయి ఇంట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా వారం తర్వాత అబ్బాయితో పాటు, అతడి తల్లిదండ్రులు అమ్మాయి చందనకు చెప్పకుండా రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్లిపోయారు. 

ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

చందన ఉదయం లేచి చూసే సరికి ఇంట్లో వారు ఎవ్వరూ కనిపించలేదు. ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని అమ్మాయి చందన గ్రహించింది. ప్రియుడు ఈశ్వర్ సహా అతడి తల్లిదండ్రులు తనను మోసం చేశారని గ్రహించి ఫిర్యాదు చేసింది. అలాగే తనకు న్యాయం జరగాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. అదే సమయంలో ఆదోని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు