/rtv/media/media_files/2025/11/18/bangla-pak-2025-11-18-11-00-02.jpg)
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ దేశ తీర్పుని భారత్ గౌరవిస్తామని చెప్పినప్పటికీ...హసీనాను అప్పగించడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. మరోవైపుఐక్యరాజ్య సమితి సైతం ఆమె అరెస్ట్ ను తప్పుబట్టింది. ఇక షేక్ హసీనా మరణశిక్ష కావాలని విధించిందేనని...దాని ద్వారా భారత్ పై కక్ష తీర్చు కుందామని బంగ్లాదేశ్ అనుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు తర్వాత, షేక్ హసీనా ,మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లు ఇద్దరూ భారత్ లోనే ఉంటున్నారు.
యూనస్ దే రాజ్యం..
మాజీ దౌత్యవేత్త షోక్సజ్జనార్ ప్రకారం.. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లోని న్యాయమూర్తులందరినీ ముహమ్మద్యూనస్ ఎంపిక చేశారు. దీంతో వీరందరూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. బంగ్లాదేశ్ లో మరణాలకు కారణం షేక్ హసీనాఅని నిరూపించబడలేదు. అయినప్పటికీ ఆమెకు మరణశిక్ష విధించారు. అంతేకాదు భారత్ వెంటనే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం డిమాండ్ కూడా చేసింది. ఇదంతా కావాలనే చేస్తున్నారని మాజీ దౌత్య వేత్తలు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు. షేక్ హసీనా మరణశిక్ష కూడా అందులో బాగమేనని చెబుతున్నారు.
రాడికల్ దేశంగా బంగ్లా..
షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను విడిచి పెట్టాక అక్కడ ప్రభుత్వం మహ్మద్ యూనస్ చేతుల్లోకి వెళ్ళింది. బంగ్లా తాత్కాలిక అధిపతిగా యూనస్ ఉన్నారు. అయితే ఇది జరిగి 15 నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. అసలు ఆ వూసే ఎత్తడం లేదు. ఎన్నికలు నిర్వహించడం కంటే బంగ్లాను పాకిస్తాన్ లా రాడికల్ దేశంగా మార్చడానికే యూనస్ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. దాంతో పాటూ ఆయన పాక్ తో చేతులు కలిపి భారత్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా స్వయంగా యనస్ భారత వ్యతిరేక ప్రకటనలు చేయడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. దాంతో పాటూ పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ బంగ్లాదేశ్ లో చురుగ్గా పని చేస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ప్రపంచం నలుమూలల నుంచీ మతాధికారులు బంగ్లాదేశ్ లో సమావేశమయ్యారని చెబుతున్నారు. వీరందరూ కలిసి బంగ్లాదేశ్‌తో సహా ప్రతి చోటా దైవ దూషణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇందులో దాదాపు 36 మంది మతాధకారులు ఒక్క పాకిస్తాన్ నుంచే వచ్చారని తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన రాడికల్ మతాధికారి ఫజుర్ రెహమాన్ అలియాస్ డీజిల్ కూడా ఢాకాలో జరిగిన మతాధికారుల సమావేశానికి రావడమే కాక..పాక్ ను బంగ్లాదేశ్ సోదరుడు అని కూడా అభివర్ణించారు.
బంగ్లా తుపాకితో గురి..
ఇదంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు కలిసి భారత్ కు వ్యతిరేకంగా ఆడుతున్న నాటకాలను విమర్శలు వినిపిస్తున్నాయి. అందు కోసమే ఒకప్పుడు బద్ధ శత్రువులైన దేశాలు ఇప్పుడు కలిసి పోయాయని చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ లక్ష్యంగా.. బంగ్లాదేశ్ ను తుపాకీగా ఉపయోగించాలనుకుంటోంది పాక్ అంటున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనుకుంటోందని రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ చెబుతున్నారు.
ఆ దేశంలో మళ్ళీ అల్లర్లు..
దాదాపు 15 నెలల తర్వాత, బంగ్లాదేశ్ మరోసారి రగిలిపోతోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతర్యుద్ధాన్ని పోలి ఉంది. వీధుల్లో దహనం జరుగుతోంది. ఒకవైపుముహమ్మద్యూనస్దళాలువీధుల్లోకి వస్తే, మరోవైపుషేక్హసీనామద్దతుదారులురాజధానిఢాకా వీధుల్లోకి వచ్చారు. అంతర్జాతీయనేరాలట్రిబ్యునల్‌లోషేక్హసీనాపైవిచారణప్రారంభమైనవెంటనే, ఆమెమద్దతుదారులుయూనస్ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. హసీనామద్దతుదారులను అణచివేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం మరొక నిరసనకారుల బృందాన్ని సృష్టించింది. ఈ బృందం షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. బుల్డోజర్లను ఉపయోగించి షేక్ హసీనా తండ్రి నివాసమైన షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక భవనంపై దాడి చేసింది. ఈ నిరసనకారుల బృందానికి యూనస్ ప్రభుత్వం పోలీసు రక్షణ కూడా కల్పించింది.
Also Read: BIG BREAKING: ఆత్మాహుతి దాడి అంటే బలిదానం..ఢిల్లీ పేలుళ్ళ ముందు ఉమర్ నబీ వీడియో..
Follow Us