BIG BREAKING: ఆత్మాహుతి దాడి అంటే బలిదానం..ఢిల్లీ పేలుళ్ళ ముందు ఉమర్ నబీ వీడియో..

ఢిల్లీ బాంబు పేలుళ్ళ ముఖ్యమైన నిందితుడు, ఉగ్రవాది ఉమర్ నబీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మాహుతి కన్నా ముందు ఈ వీడియో రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో అతను ఆత్మాహుతి దాడి అంటే బలిదానం, పవిత్రమైనది అంటూ మాట్లాడాడు.

New Update
umar nabi

Umar nabi, Delhi Blast

ఢిల్లీ ఆత్మాహుతి దాడి సడెన్గా , అన్ ప్లాన్డ్ గా జరిగింది కాదని తెలుస్తోంది. దీనికి ముందే ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఉగ్రవాది ఉర్ నబీ వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఇందులో అతను ఆత్మాహుతి గురించి మాట్లాడాడు. ఇది అతను స్వయంగా రికార్డ్ చేసిన వీడియో. ఆత్మాహుతి బాంబు దాడి అంటే పవిత్రమైదిఅని..బలిదానమని ఈ వీడియోలో ఉమర్ చెప్పాడు. ఆత్మాహుతి గురించి అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని..దాన్ని చెడుగా లేబుల్ చేశారని అన్నాడు. ఇసలాంలో దీన్ని బలిదాన ఆపరేషన్ అంటారని ఉమర్ చెప్పాడు. ఇప్పుడు దీనికి అర్ధాలు మార్చేశారి...వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నాడు. బలిదానం ఆపరేషన్ అంటే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట స్థంలో చనిపోతానని భావించడం తప్ప వేరే ఏమీ కాదంటూ వీడియోలో ఉమర్ మాట్లాడాడు. మొత్తం అంతా ఇంగ్లీషులోనే మాట్లాడాడు. దీన్ని బట్టి ఉమర్ పూర్తిగా తీవ్రవాద భావజాలానికి లొంగిపోయాడని..దాన్ని నరనరాన జీర్ణించుకున్నాడని తెలుస్తోంది.

డానిష్ విచారణలో సంచలన విషయాలు..

అంకు ముందు కారు బాంబ్ ను తయారు చేసిన ఉగ్రవాది డానిష్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్  కంటే ముందు వీరు డ్రోన్లు, రాకెట్లతో దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి తరహా గా దీన్ని ప్లాన్ చేశామని నిందితులు తెలిపారు. డానిష్ ను ఎన్ఐఏ శ్రీనగర్ లో అదుపులోకి తీసుకుంది. ఇతను కారు బాంబును తయారు చేసి ఇవ్వడమే కాక..అంతకు ముందు డ్రోన్లు, రాకెట్ల తయారీలో కూడా టెక్నికల్ గా సపోర్ట్ చేశాడు. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్‌లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడని ఎన్ఐఏ చెబుతోంది. అతనికి చిన్న ఆయుధ డ్రోన్లను తయారు చేయడంలో అనుభవం ఉందని తెలిపారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలతో కూడానడ్రోన్లను పంపి ప్రాణ నష్టం జరిగేలా చేయాలని ప్లాన్ చేశారని..ఇలాంటి వ్యూహాన్నే అంతకు ముందు హమాస్, సిరియాల్లోని టెర్రరిస్ట్ గ్రూపులు ఉపయోగించాయని చెబుతున్నారు.

Also Read: Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే

Advertisment
తాజా కథనాలు