Ayatollah Ali Khamenei: 45 ఏళ్లుగా కోటు లోపలే ఖమేనీ కుడి చేయి.. కారణం ఏంటో తెలుసా?

ఖమేనీ జీవితంలో ఇది మొదటి దాడి కాదు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1981లో ఆయనపై ఒకసారి భయంకరమైన హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది.

New Update
_Ali Khamenei

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) టార్గెట్‌గా ఇజ్రాయెల్, అమెరికా(america) దళాలు టెహ్రాన్‌లోని దాదాపు 30 ప్రాంతాలపై భారీ బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్(iran-isreal-war) ప్రభుత్వం 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిందని, పవిత్రమైన జమ్‌కారన్‌ మసీదుపై ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండా ఎగురవేశారనే ప్రచారం జరుగుతోంది. ఖమేనీ డెడ్‌బాడీ మాత్రం ఇప్పటి వరకూ లభించలేదు.

Also Read :  ఏపీ, కర్ణాటకలో రహస్య చమురు నిల్వలు.. 74 రోజులు మాత్రమే భారత్ సేఫ్

Ayatollah Ali Khamenei Paralyzed In Attack

ఖమేనీ జీవితంలో ఇది మొదటి దాడి కాదు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1981లో ఆయనపై ఒకసారి భయంకరమైన హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది. ఆ సమయంలో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. 1981 జూన్ 27వ తేదీన ఖమేనీ మసీదులో ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం తన ఫాలోవర్స్‌తో మాట్లాడారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ఓ యువకుడు ఖమేనీ దగ్గరకు వచ్చాడు. అతను ఆయన ముందున్న టేబుల్‌పై టేప్ రికార్డర్‌ను ఉంచాడు. అది పేలడంతో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలలు పట్టింది. కుడి చెయ్యి, స్వర పేటిక, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆనాటి పేలుడులో ఆయన ఊపిరితిత్తులు, స్వరపేటిక దెబ్బతినడమే కాకుండా, కుడి చేయి శాశ్వతంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన కుడి చేతిని కోటు వెనుక దాచుకుంటూ ఉండేవారు. ఆనాడు మృత్యువును జయించి సుప్రీం లీడర్‌గా ఎదిగిన ఖమేనీ, తాజా దాడుల్లో మరణించారనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. - khameni vs trump

Also Read :  ఇరాన్‌కు మరో బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్‌ మృతి ?

Advertisment
తాజా కథనాలు