Gujarat: టాయిలెట్‌లో ఉండి వర్చువల్‌ విచారణ.. కోర్టు కీలక ఆదేశం

ఇటీవల గుజరాత్‌లో ఓ వ్యక్తి టాయిలెట్‌ నుంచి వర్చువల్‌గా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అతడి చర్యలు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశించింది.

New Update
Gujarat High Court takes suo motu contempt action against man for attending virtual hearing from toilet

Gujarat High Court takes suo motu contempt action against man for attending virtual hearing from toilet

ఇటీవల గుజరాత్‌లో ఓ వ్యక్తి టాయిలెట్‌ నుంచి వర్చువల్‌గా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా అతడి చర్యలు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జూన్ 20న ఓ కేసును జస్టిస్‌ నజీర్‌ ఎస్‌. దేశాయ్ వర్చువల్‌గా విచారించారు.  

Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం

ఆ సమయంలో సూరత్‌కు చెందిన కిమ్ గ్రామవాసి అబ్దుల్ సమద్.. టాయ్‌లెట్‌ నుంచి విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని న్యాయమూర్తి కూడా గుర్తించలేదు. కానీ అతడు టాయిలెట్‌లో ఉండి విచారణకు హాజరైన వీడియో బయటపడింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా అతడిని తీవ్రంగా విమర్శించారు. దీంతో అతడిపై సుమోటోగా కోర్టు ధక్కరణ చర్యలు నమోదు చేయాలని జూన్ 20న జరిగిన విచారణలో జస్టిస్ ఏ.ఎస్‌ సుపేహియా, జస్టిస్ టీఆర్‌ వచ్ఛనీలతో కూడిన డివిజన్ ధర్మాసనం రిజస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు

 వర్చువల్‌గా విచారణ జరిగేటప్పుడు మళ్లీ ఇలాంటి చర్యలు జరగకుండా ఎలా నివారించాలో కోర్టుకు తెలపాలని సమాచార, సాంకేతిక రిజిస్ట్రార్‌ను బెంచ్ కోరింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూస్తే.. అబ్దుల్ సమీద్ టాయిలెట్‌లోకి వెళ్లి మొబైల్‌ ఫోన్‌ను తాను కనిపించేలా నేలపై పెట్టాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వర్చువల్ విచారణ నుంచి డిస్కనెక్ట్‌ అయ్యారు. కొంత సమయం తర్వాత మళ్లీ విచారణకు హాజరయ్యారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు