Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఇరాన్ కరెన్సీ మరోసారి కుదేలైపోయింది. చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనైపోయింది. ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఏకంగా 10 లక్షల ఇరానియన్ రియాల్స్‌కు దిగజారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు తగ్గుతుందనేదానిపై అనిశ్చితి నెలకొంది.

New Update
Iran's currency falls to record low against the dollar as tensions run high

Iran's currency falls to record low against the dollar as tensions run high

ఇరాన్ కరెన్సీ మరోసారి కుదేలైపోయింది. చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనైపోయింది. ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఏకంగా 10 లక్షల ఇరానియన్ రియాల్స్‌కు దిగజారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు తగ్గుతుందనేదానిపై అనిశ్చితి నెలకొంది. దీనివల్ల దేశంలో కరెన్సీ మారకానికి కేంద్రంగా ఉండే టెహ్రాన్‌లో ఫెర్దౌసీ విధిలో చాలామంది వ్యాపారులు తమ నగదు బదిలీ వ్యాపారాన్ని నిలుపుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. 

Also Read: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజ్‌  ఇటీవలే మొదలైంది. సెలవులు ఉన్న నేపథ్యంలో అక్కడ కరెన్సీ మార్కెట్లు మూతబడిపోయాయి.  కేవలం వీధుల్లో మాత్రమే అనధికారిక ట్రేడింగ్‌ కొనసాగింది. దీనివల్ల మార్కెట్‌పై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. సెలవుల తర్వాత శనివారం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో రియాల్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఒక్క డాలర్‌కు ఏకంగా 10,43,000 రియాల్స్‌కు దిగజారిపోయింది.  

Also Read: ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

ఇదిలాఉండగా అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా పతనావస్థలో ఉంది. 2015లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకునే సమయానికి అక్కడ ఒక డాలర్‌కు 32 వేల రియాల్స్‌ ఉండేవి. అప్పటినుంచి దీని విలువ పతనమవుతూ వస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మరింత పతనమయ్యింది. తాజాగా 10.43 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. ఇప్పుడు ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ కరెన్సీగా ట్రేడ్ అవుతోంది.  

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం!

 iran | telugu-news | rtv-news | usa | dollar

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు