/rtv/media/media_files/2025/06/24/iran-state-tv-says-israeli-strike-killed-nuclear-scientist-2025-06-24-16-15-10.jpg)
Iran state TV says Israeli strike killed nuclear scientist
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన మరో కీలకమైన అణు శాస్త్రవేత్త సయ్యద్ మహమ్మద్ రెజా సిద్దఘీ సాబెర్ ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనకు ముందు సోమవారం రాత్రి జరిగిన దాడిలో ఆయన మృతి చెందినట్లు తాజాగా పేర్కొంది. ఉత్తర ఇరాన్‌లోని ఆస్తనేహ్ యె అష్రాఫియాలో ఆయన తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండగానే ఈ దాడి జరిగినట్లు తెలిపింది.
Also Read: బిలావల్ భుట్టో బలుపు మాటలు.. ఇండియాని రెచ్చగొడుతున్న పాకిస్తాన్
అయితే కొన్నాళ్ల క్రితమే రెజా సిద్దఘీ కుమారుడు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు. అంతేకాదు రెజా సిద్దఘీని అమెరికా ఆంక్షల జాబితాలో కూడా చేర్చింది. ఇరాన్‌లోని ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ రీసెర్చ్‌కు చెందిన షహిద్ కరీమి గ్రూప్‌నకు ఆయనే అధిపతిగా ఉండేవారు. ఈ ఆర్గనైజేషన్ పేలుడు పదార్థాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేస్తోంది. అలాగే రెజా సిద్దఖీ న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజివ్స్ పరికరాల తయారీ ప్రాజెక్టులో కూడా కీలకంగా వ్యవహరించారు.
Also Read: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
ఇదిలాఉండగా ఇటీవల ఇరాన్‌లోని నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెరికా కూడా ఆ అణుస్థావరాలపై దాడులు చేసింది. 14 బంకర్‌బస్టర్ బాంబులు ప్రయోగించడంతో ఈ అణుకేంద్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇరాన్ అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా మరో కీలక అణు శాస్త్రవేత్త కూడా మరణించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!