బిలావల్ భుట్టో బలుపు మాటలు.. ఇండియాని రెచ్చగొడుతున్న పాకిస్తాన్

సిందూ నదీ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోరుజారారు. తమ దేశానికి నీళ్లు వదలకపోతే యుద్ధానికి దిగుతామని ఆయన అన్నారు.  సింధు జలాలను పునరుద్ధరించకుంటే యుద్ధం తప్పదని భుట్టో ప్రగల్భాలు పలికారు.

New Update
Bilawal Bhutto Zardari

పాకిస్తాన్ ఇండియాపై మరోసారి కాలుదువ్వుతుంది. సిందూ నదీ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోరుజారారు. తమ దేశానికి నీళ్లు వదలకపోతే యుద్ధానికి దిగుతామని ఆయన అన్నారు.  సింధు జలాలను పునరుద్ధరించకుంటే యుద్ధం తప్పదని భుట్టో ప్రగల్భాలు పలికారు. సింధూ నదీ జలాల విషయంలో భారత్ ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. నీళ్లు ఇవ్వండి లేదంటే.. మేమే తీసుకుంటామని బిలావల్ భుట్టో అన్నారు. 

సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించకుంటే.. భారత్‌లో హింస తప్పదన్న పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాలు ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని భారత్‌ ప్రకటించింది. భారత్‌ వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్నది.

Advertisment
తాజా కథనాలు