US-Israel-Iran War: కొనసాగుతున్న భీకర యుద్ధం.. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వాడుతున్న ఆయుధాలు ఇవే !

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్‌ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు.

New Update
dvanced Weaponry and Strategic Losses in US-Israel-Iran Conflict

dvanced Weaponry and Strategic Losses in US-Israel-Iran Conflict

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్‌ భీకర దాడులు(us israel iran war 2026) చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఈ యుద్ధంలో భారీగా ఖర్చు అవుతోంది. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతోనే దాడులు కొనసాగిస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులకు దిగాయి. అయితే ఇరువైపులా ఎలాంటి ఆయుధాలు వాడారో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read :  యుద్ధంలో కీలక పరిణామం.. గల్ఫ్‌ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా వాడిన ఆయుధాలు

B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్: 

ఇరాన్‌లోని భూగర్భ క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులతో వీటిని వాడుతోంది. - iran us war

B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లు:

B-52 బాంబర్లు కూడా ఇరాన్‌లోని భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేశాయి.  ఇరాన్‌(iran israel war) అణు కేంద్రాలైన నటాంజ్‌, ఫోర్డోలపై ఈ బాంబర్లు దాడి చేశాయి. ఇవి ప్రయోగించిన GBU-57 బాంబులు భూమిలోపలికి చొచ్చుకెళ్లాయి. వందల అడులు లోతులో ఉన్న అణు రియాక్టర్లను ఈ బాంబర్లు పేల్చేశాయి. దీంతో ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని అమెరికా ప్రకటించింది.  

టోమాహాక్ క్షిపణులు

అమెరికా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించే ఈ టోమాహాక్ మిస్సైల్స్ 1600 కి.మీ దూరంలోని టార్గెట్‌లను ఛేదిస్తున్నాయి.

LUCAS (Low-cost Unmanned Combat Attack System) డ్రోన్లు

ఇరాన్‌కు చెందిన షాహెడ్ డ్రోన్ల లాగే తక్కువ ఖర్చుతో కూడిన 'కామికేజ్' (ఆత్మహుతి) డ్రోన్లను అమెరికా మొదటిసారిగా భారీగా వాడుతోంది.

Also Read :  దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడి!

ఇజ్రాయెల్ ఆయుధాలు

F-35I 'అదిర్' యుద్ధ విమానాలు: 
ఈ యుద్ధ విమానాలు రాడార్లకు దొరక్కుండా ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. 

రాంపేజ్, డెలిలా క్షిపణులు:
 గాలి నుంచి భూమిపైకి ప్రయోగించే ఈ క్షిపణులు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి.

ఐరన్ డోమ్, బాణం (Arrow) వ్యవస్థ:

ఇరాన్ పంపే వందలాది క్షిపణులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన పటిష్టమైన ఐరన్ డోమ్, బాణం రక్షణ కవచాన్ని వినియోగిస్తోంది. రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లు, ఆర్టిలరీ షెల్స్‌ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేందుకు దీన్ని రూపొందించారు.

ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలు

ఇరాన్ తన 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' వ్యూహంలో భాగంగా వేలాది సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.

బాలిస్టిక్ క్షిపణులు:
 ఇరాన్ తమ అమ్ములపొదిలోని ఖైబర్ షెకాన్, ఫతా-1 లాంటి హైపర్ సోనిక్ మిసైళ్లతో దాడులు చేసింది వాడింది. ఇవి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ప్రయత్నించాయి. మార్చి 7 నాటికి ఇరాన్ దాదాపు 571 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది.

ఆత్మహుతి డ్రోన్లు:
 ఇరాన్‌.. షాహెడ్-136, అలాగే కొత్త రకం అరాష్-2 డ్రోన్లను భారీగా ప్రయోగించాయి. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ  గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేశాయి. అలాగే ఇజ్రాయెల్‌పై కూడా దాడికి దిగాయి. ఇరాన్ ఇప్పటిదాకా దాదాపు 1391 డ్రోన్లను ప్రయోగించింది.

క్రూయిజ్ క్షిపణులు: 

పావే లాంటి దూరశ్రేణి క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తోంది. 

ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై సుమారు 2,500 కంటే ఎక్కువ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 6,000 కంటే ఎక్కువ అత్యాధునిక బాంబులు మరియు క్షిపణులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన 80 శాతం గగనతల రక్షణ వ్యవస్థలను (S-300 వంటివి) అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ధ్వంసం చేశాయి. 

Advertisment
తాజా కథనాలు