US-Iran War: ఈ రాత్రికి ఇరాన్ ఖతం.. బిగ్ అటాక్ కు అమెరికా స్కెచ్.. సంచలన కథనాలు!

పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరనుంది. ఇరాన్‌లో బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్‌కు భారీగా మందుగుండును సరఫరా చేసింది.

New Update
A Chronological Timeline of Major Events from Feb 28 to March 6 in Iran usa, israel war

Iran usa,israel war

US-Iran War:  పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది.ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు యుద్ధం మరింత విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని తేల్చి చెబుతోంది. ఇవాళ రాత్రికి (శనివారం, మార్చి 7) యుద్ధం తారాస్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇరాన్‌లో బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్‌కు భారీగా మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడం సంచలనంగా మారింది. ఈ రాత్రికి ఇరాన్‌ పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. అందుకు తగినట్లే పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇప్పటి వరకు 3వేలకు పైగా లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేయగా, యుద్ధం మూలంగా ఇరాన్ పెను విధ్వంసాన్ని చవిచూసింది.
 
గత రెండురోజులగా భీకర యుద్ధం లో ఇరాన్‌ టెల్ అవీవ్‌పై దాడి చేయడంతో ప్రతికారంగా ఇజ్రాయెల్‌.. టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు దిగింది. దీంతో ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లు, ఎయిర్‌పోర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ఈ రాత్రికి ఇరాన్‌ లో పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్‌ సిద్దమైంది. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్‌ అభివృద్ది చేస్తోన్న క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంచర్లను నాశనం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇది తాము చేయబోయే అతి పెద్ద ఆపరేషన్‌ అని ఇది చరిత్రలో మిగిలిపోతుందని అమెరికా మీడియా ఛానల్‌తో మాట్లాడిన  అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ చెప్పుకొచ్చారు.ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు ఉదయం నుంచే టెహ్రాన్‌ సహా ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ దాడులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసి వేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోందని బెసెంట్ ఆరోపించారు.

 ఇరాన్‌ పై ప్రతికారం తీర్చుకోవాలని నిర్ణయించిన అమెరికా ఇప్పటికే రెండు యుద్ధ విమాన వాహక నౌకలను ఇరాన్‌ వైపు తరలించింది. తాజాగా మరో వాహక నౌక యూఎస్‌ఎస్‌ జార్జ్ హెచ్‌డబ్ల్యూ. బుష్ అట్లాంటిక్‌ను దాటి తూర్పు మధ్య ధరా వైపు కదిలినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు కరేబియన్‌ సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా మరో యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలింది.  దీంతో రానున్న రోజుల్లో ఈ యుద్దం మరింత భీకరంగా మారే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు