/rtv/media/media_files/2025/06/23/iran-hangs-man-accused-of-spying-for-israel-2025-06-23-19-58-43.jpg)
Iran hangs man accused of spying for Israel
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తి ఇరాన్‌లో దొరికిపోయాడు. దీంతో తాజాగా అతడికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొస్సాద్‌కు కీలకమైన సమాచారం ఇచ్చిన ఘటనలో మొహమ్మద్ అమీన్ అనే వ్యక్తికి సోమవారం ఉరిశిక్ష అమలుచేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థ అధికారికంగా ప్రకటన చేసింది.
Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత.. సమాచారం లీక్ చేస్తున్నారనే కారణాలతో ఇరాన్ ఇప్పటిదాకా ముగ్గురిని ఉరితీసింది. తాజాగా ఉరిశిక్షకు గురైన మొహమ్మద్ అమీన్.. మొస్సాద్ సహకారంతో ఓ సైబర్ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ఆపరేషన్లు చేపట్టాడని చెప్పారు. ఇజ్రాయెల్ ఏజెంట్లతో కూడా అతడు పొరుగు దేశంలో భేటీ అయ్యాడని.. ఇస్లామిక్ రిపబ్లిక్ సాయుధ దళాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే బాధ్యత అతడికి అప్పగించినట్లు వివరించారు.
Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం.. ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం బిగ్ అలెర్ట్!
ఇదిలాఉండగా ఈ గూఢచర్య ఆరోపణలతో గతవారమే ఇస్మాయిల్ ఫక్రీ, మాజిద్ మోసయేబి అనే ఇద్దరు వ్యక్తులకు కూడా ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. అయితే ఈ ఉరిశిక్షలపై ప్రపంచ మానవ హక్కుల సంఘాలు, ఇతర సంస్థలు స్పందిస్తున్నాయి. ఇరాన్ న్యాయ వ్యవస్థలోని పారదర్శకతను ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే, విచారణ చేయకుండానే ఇలా ఉరిశిక్షలు తీయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: అమెరికాకు బిగ్ షాక్.. సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ !