/rtv/media/media_files/2025/06/23/russian-attacks-on-ukraine-kill-at-least-10-people-2025-06-23-19-08-43.jpg)
Russian attacks on Ukraine kill at least 10 people, most of them in Kyiv
Russia-Ukraine War: మూడేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు కాల్పల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రష్యా.. ఉక్రెయిన్‌పైకి ఏకంగా 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
Also Read: అమెరికాకు బిగ్ షాక్.. సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ !
ఈ దాడుల్లో 10 మంది పౌరులు మృతి చెందారని తెలిపారు. అలాగే చాలావరకు ఇళ్లు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. నేలమట్టమైన భవనాల శిథిలాల కింది ఇంకా చాలా మంది చిక్కుకున్నారన్నారు. వాళ్లను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం.. ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం బిగ్ అలెర్ట్!
మరోవైపు ఉక్రెయిన్‌పై జరిగిన దాడిలో రష్య సైన్యం ఉత్తర కొరియకు చెందిన ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలు చేస్తున్నారు. రష్యాకు ఉ.కొరియా ఆయుధాలు, సైన్యాన్ని పంపిస్తే యుద్ధ పరిస్థితులు తీవ్రతమరవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం యూకే పర్యటనకు వెళ్లిన తమ రక్షణ మంత్రి.. ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలనే డిమాండ్‌ను మరోసారి వినిపించనున్నారని చెప్పారు. అలాగే ఈ వారంలో హేగ్‌లో జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు తాను లండన్‌లో ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ అవ్వనున్నట్లు పేర్కొన్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలంటూ జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.
Also Read: అమెరికాకు బిగ్ షాక్.. సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ !
#Russia launched a ballistic missile attack on the city of Bilhorod-Dnistrovskyi.#Russian forces destroyed a local educational institution.
— UkraineWorld (@ukraine_world) June 23, 2025
So far, it is known that two people have been killed and 20 injured. Three of the wounded are in critical condition. The others, including… pic.twitter.com/BJmQrQWZoP
Also Read: ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా?: అసలు నోబెల్ రావడానికి రూల్స్ ఏంటో తెలుసా?