Capture Maduro: ఆపరేషన్ వెనెజువెలా, ఆగస్టు నుంచే ప్లాన్ చేసిన అమెరికా.. వెలుగులోకి సంచలన నిజాలు

వెనెజువెలాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. దీనికోసం అగ్రదేశం చాలా నెలల క్రితమే ప్లాన్ చేసింది. కరేబియన్ సముద్రంలో మాటువేసి వ్యూహాత్మకంగా నికోలస్‌ మదురోను అదుపులోకి తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Inside Operation Absolute Resolve to capture Maduro

Inside Operation Absolute Resolve to capture Maduro

వెనెజువెలాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్(operation) ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. దీనికోసం అగ్రదేశం చాలా నెలల క్రితమే ప్లాన్ చేసింది. కరేబియన్ సముద్రంలో మాటువేసి వ్యూహాత్మకంగా నికోలస్‌ మదురో(Nicolás Maduro) ను అదుపులోకి తీసుకుంది. ఇంతకీ అమెరికా ఈ ప్రణాళికను ఎలా విజయవంతం చేసిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఆగస్టులోనే అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA) బృందం వెనెజువెలాలోకి ప్రవేశించింది.   

ఈ టీమ్ ఆ దేశ రాజధాని కారకాస్‌ చుట్టుపక్కల నికోలస్ మదురో కదిలక(Capture Maduro)లపై నిఘా వేసింది. ఆయన కదలికల గురించి సమాచారాన్ని సేకరించింది. అలాగే స్టెల్త్‌ డ్రోన్ల దళం కూడా కారకస్‌పై సైలంట్‌గా సంచరించింది. మదురో తిరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి ఓ మ్యాప్‌ను రూపొందించింది. అయితే అమెరికాకు చెందిన దౌత్యకార్యాలయం వెనెజువెలాలో లేదు. అయినప్పటికీ వాళ్లు సీఐఏ టీమ్‌ తమ ఆపరేషన్‌ను వ్యూహాత్మకంగా కొనసాగించింది.    

డెల్టాఫోర్స్‌ కమాండోలు సైతం ఈ ఆపరేషన్ కోసం కెంటకీలోని స్పెషల్ ఆపరేషన్స్‌ కమాండ్‌లో ఓ ప్లాన్ చేసారు. నికోలస్ మదురో ఇంటి నమునాను సృష్టించారు. దీని ఆధారంగా స్టీల్‌ డోర్లను వేగంగా బద్దలు కొట్టేలా మరో ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే మదురో 8 ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఎక్కడ ఉంటాడో నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయి. చివరికి డెల్టాఫోర్స్‌ సాధన చేసినటువంటి కాంపౌండ్‌లోనే మదురో ఉన్నట్లు తేలింది. ఓవైపు ఆపరేషన్ కొనసాగుతుండగానే మరోవైపు అమెరికా స్పెషల్ ఆపరేషన్ విమానాలు, సాయుధ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్‌ ఫ్లైట్లు, సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్‌లు అలాగే ఇతర దళాలను వెనెజువెలా తీరానికి తరలించింది.  

Also Read: కోతులకు భయపడుతున్న MLAలు.. అసెంబ్లీలో మిమిక్రీ ఆర్టిస్టుల నియామకం

Inside Operation Absolute Resolve To Capture Maduro

సముద్రంలో డ్రగ్స్‌ బోట్ల పేరుతో వరుసగా దాడులు చేసింది. ఈ కాల్పుల్లో 115 మంది మృతి చెందారు. గతవారం CIA వెనెజువెలాలో ఓ పోర్టుపై దాడులు చేసింది. ఇదే సమయంలో మదురో అమెరికాతో డీల్‌ కుదుర్చుకోవాలనుకున్నారు. కానీ అది ఫెయిల్ అయిపోంది. ఇక కారకస్‌లో తాజాగా చేపట్టిన దాడికి 2025 డిసెంబర్‌లోనే ట్రంప్‌ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ దాడి ఎప్పుడు చేయాలి అనేదానిపై పెంటగాన్, స్పెషల్ ఆపరేషన్స్‌ ప్లానర్లకే అప్పజెప్పారు.  

ముందుగా ఈ ఆపరేషన్‌ను న్యూఇయర్, క్రిస్మస్‌ సెలవుల టైమ్‌లో చేపట్టాలని అనుకున్నారు. అప్పుడు ఎక్కువ మంది సైనిక, ప్రభుత్వ సిబ్బందికి వెకేషన్లు, సెలవులు ఉండటం వల్ల ఆపరేషన్‌కు కలిసొస్తుందని భావించారు. కానీ వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఈ ప్లాన్ వాయిదా పడింది. చివరికి శుక్రవారం రాత్రి 10.46 నిమిషాలకు ట్రంప్‌ నుంచి తుది ఆదేశాలు వచ్చాయి.  

ఆపరేషన్‌ను నూతన సంవత్సరం, క్రిస్మస్‌ సెలవుల సమయంలో నిర్వహించాలని తొలుత భావించారు. ఆ సమయంలో ఎక్కువ మంది సైనిక, ప్రభుత్వ సిబ్బంది వెకేషన్లు, లీవ్‌ల్లో ఉండటం కలిసొస్తుందని భావించారు. కానీ, చాలా సార్లు వాతావరణం అనుకూలించక వాయిదాపడింది. శుక్రవారం రాత్రి 10.46 నిమిషాలకు అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి తుది ఆదేశాలు వెలువడ్డాయి. వాస్తవానికి సాయంత్రం 4.30 సమయంలోనే అమెరికా దళాలు కొన్ని ఆయుధాలను తొలివిడతలో ప్రయోగించేందుకు ఆదేశాలు అందాయి.

Also Read: వెనెజువెలా పని అయిపోయింది..ఇక మిగిలింది క్యూబా, మెక్సికో ,కొలంబియానే..ట్రంప్ హెచ్చరిక

నికోలస్ మదురోను బంధించేందుకు ఓ యూనిట్‌ బయలుదేరింది. వీళ్లు డెల్టాఫోర్స్‌ దళాల కోసం ప్రత్యేకంగా మార్పులు చేసిన MH60, MH47 వంటి హెలికాప్టర్లను నడిపించారు. అయితే ఈ యూనిట్‌ గత కొన్ని నెలలుగా వెనెజువెల తీరం సమీపంలోనే శిక్షణ తీసుకుంది. డెల్టా ఫోర్స్‌ కమాండోలు ముందుగా మదురో కాంపౌండ్‌లో దిగారు. ఈ ఆపరేషన్‌ను ఫ్లొరిడాలోని 'మార్‌ ఎ లాగో' ఎస్టేట్‌లో ట్రంప్‌ నేరుగా వీక్షించారు. మదురో గదిలోకి ఆ టీమ్‌ వెళ్లగా.. ఆయన తన భార్యతో కలిసి స్పెషల్ స్టీల్‌రూమ్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ ఆ రూమ్‌ను చుట్టుముట్టిన దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి. 

శనివారం తెల్లవారుజామున 4.29 గంటలకు మదురో దంపతులను హెలికాప్టర్‌ ఎక్కించి యుద్ధ నౌక USS ఐవా జిమా వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్వాంటనామో బేలోని నౌకా స్థావరంలో ఉంచారు. అనంతరం ప్రభుత్వ విమానంలో మదురోను, తన భార్యను అమెరికాకు తీసుకొచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకోవడంపై ప్రపంచ దేశాలు షాకైపోయాయి. 

Advertisment
తాజా కథనాలు